Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లే.. బల్ల గుద్ది మరీ చెప్పిన ఆది రెడ్డి.. వీడియో
మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ జరగనుంది. ఈ సారి కంటెస్టెంట్స్ ఎవరన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆది రెడ్డి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరేనంటూ ఒక వీడియోను రిలీజ్ చేశాడు.

బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ కోసం కౌంట్ డౌన్ మొదలైంది. ఈ ఆదివారం (సెప్టెంబర్ 06) సాయంత్రం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ జరగనుంది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి షోలో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయని హోస్ట్ నాగార్జునతో పాటు బిగ్ బాస్ నిర్వాహుకులు చెబుతున్నారు. అలాగే గేమ్స్, టాస్కుల్లోనూ చాలా మార్పులు చేశారని టాక్. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ ఎవరన్నది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఆడియెన్స్ కు డబుల్ ఎంటర్ టైన్మెంట్ అందించేవారినే కంటెస్టెంట్స్ గా ఎంపిక చేశామంటూ బిగ్ బాస్ మేకర్స్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 10 హౌస్ లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్స్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో అయితే చాలా పేర్లే వినిపిస్తున్నాయి. పలువురు సినీ సెలబ్రిటీలు, బుల్లితెర సెలబ్రిటీలు, అలాగే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు ఈసారి హౌస్ లో సందడి చేయనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆది రెడ్డి సీజన్ 10కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇదే క్రమంలో ఈసారి హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఉన్న కంటెస్టెంట్ల జాబితాను కూడా ఆయన వివరించారు.
కాగా గతంలోనూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తదితర వివరాకు సంబంధించి ఆది రెడ్డి అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా బిగ్ బాస్ సీజన్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు ఆది రెడ్డి. అతని అంచనా ప్రకారం..
1.‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంలో సెకండ్ హీరోగా నటించిన అదిత్ ఈశ్వరన్, 2. సీరియల్ నటుడు ముఖేష్ గౌడ అలియాస్ రిషి 3. రోహిత్ (కామనర్), 4. వినాయకుడు మూవీ హీరో కృష్ణుడు, 5. శాలినీ, 6. జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్ 7. టెంపర్ వంశీ 8. సృష్టి వ్యాకరణం 9. ఆర్జే చరణ్ – ‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్ 10. యాంకర్ వర్షిణీ సౌందర రాజన్ 11. ఝాన్సీ – రైతు, సింగర్,- ‘అగ్నిపరీక్ష’కంటెస్టెంట్ 12. ‘జబర్దస్త్’ నరేష్ 13. సీరియల్ నటి దేబ్జానీ మోదక్ 14. ప్రముఖ సీరియల్ నటి చైత్ర రాయ్ 15. నవరసాలు ఆర్కే – ‘అగ్నిపరీక్ష’ కామనర్ కంటెస్టెంట్. సుధీర్ రెడ్డి – పోడ్‌కాస్టర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి కంటెస్టెంట్స్ గా రానున్నారని తెలుస్తోంది.
ఆది రెడ్డి రిలీజ్ చేసిన వీడియో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




