AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: ఇదేం ట్విస్ట్.. మరోసారి బిగ్‌బాస్‌లోకి నటుడు శివాజీ.. రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 10 ప్రారంభోత్సవానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. రేపు ఆదివారం(సెప్టెంబర్‌ 6)న సాయంత్రం 7 గంటల నుంచి బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ ఉండనుంది. అక్కినేని నాగార్జుననే ఈసారి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

Bigg Boss Telugu 10: ఇదేం ట్విస్ట్.. మరోసారి బిగ్‌బాస్‌లోకి నటుడు శివాజీ.. రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Sep 05, 2026 | 10:24 PM

Share

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 10 ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం(సెప్టెంబర్‌ 6)న సాయంత్రం 7 గంటల నుంచి అధికారికంగాఈ రియాలిటీ షో ప్రారంభం కానుంది. గత సీజన్ల లాగే ఈసారి కూడా అక్కినేని నాగార్జునే బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరించనున్నడు. ఇక ఆదివారం జరిగే బిగ్ బాస్ తెలుగు సీజన్ గ్రాండ్ లాంఛింగ్ కు సర్దార్ 2 హీరో కార్తీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. మరోవైపు బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకైతే జబర్దస్త్ నుంచి ఆటో రామ్ ప్రసాద్, అలాగే అగ్ని పరీక్ష సీజన్ 2 లో సత్తా చాటిన సింగర్ ఝాన్సీ కంటెస్టెంట్స్ గా ఫైనలైజ్ అయ్యారు. వీరితో పాటు దేబ్జానీ, టెంపర్‌ వంశీ, కృష్ణుడు, త్రిగుణ్‌, చైత్ర రాయ్‌, జబర్దస్త్ నరేష్‌, ముఖేష్‌ గౌడ, వర్షిణి సౌందరాజన్‌, సుధీర్‌ రెడ్డి, అలాగే కామనర్స్ కోటాలో ఆర్జే చరణ్‌, అమన్‌, రోహిత్‌ నాయుడు,షాలిని, సృష్టి వ్యాకరణం వంటి వారు హౌజ్‌లోకి వెళ్తున్నారని సమాచారం. దీనిపై రేపటి సాయంత్రం దాకా గానీ క్లారిటీ రాదు.

ఇదిలా ఉంటే ప్రముఖ నటుడు శివాజీ మరోసారి బిగ్ బాస్ లోకి రానున్నారు. అయితే కంటెస్టెంట్ గా మాత్రం కదు. బిగ్‌ బాస్‌ మెయిన్ షోతో పాటు దీనికి అనుబంధంగా ప్రసారమయ్యే బిగ్‌ బాస్‌ బజ్‌కి కూడా మంచి క్రేజ్‌ ఉంది. ఇందులో ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు వస్తారు. హౌస్ కు సంబంధించి తమ అనుభవాలను పంచుకుంటారు. అలాగే తోటి కంటెస్టెంట్ల గురించి తమ అభిప్రాయాలు వెల్లడిస్తారు. అలా ఈసారి కూడా శివాజీనే బిగ్ బాస్ బజ్‌కు హోస్ట్ గా వ్యవహరించున్నారట. గత సీజన్ లోనూ ఆయనే యాంకర్ గా చేసిన సంగతి తెలిసిందే. కాగా బిగ్ బాస్ బజ్ అనేది కేవలం వారంతలోనే ఉంటుంది. ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ప్రతి ఆదివారం రాత్రి ఈ షో ప్రసారం అవుతుంది. అంటే వీక్లీ ఒక్కసారి మాత్రమే ఈ ఎపిసోడ్‌ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ షో కోసం శివాజీ ఎంత పారితోషికం తీసుకుంటున్నాడనేది ఆసక్తికరంగా మారింది. గత సీజన్‌లో ఆయన ఒక్కో ఎపిసోడ్‌కి అంటే ఒక్కో ఇంటర్వ్యూకి మూడున్నర లక్షలు తీసుకున్నారట. ఇప్పుడు కూడా రూ.3.50-4లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ షో సుమారు 15 వారాలు ఉంటుంది. అంటే సుమారు రూ.50-60లక్షల వరకు శివాజీ పారితోషికం అందుకోనున్నారని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us