Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kichcha Sudeep: ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక.. వద్దన్న స్టార్ హీరో కిచ్చా సుదీప్.. కారణమేంటంటే?

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ మరోసారి వార్తల్లో నిలిచారు. బిగ్ బాస్ హోస్టింగ్ వదిలిపెట్టడం తదితర కారణాలతో ఈ మధ్యన బాగా ట్రెండ్ అయ్యాడీ స్టార్ హీరో. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక అవార్డును తిరస్కరించి మరోసారి హాట్ టాపిక్ గా నిలిచాడు కిచ్చా సుదీప్.

Kichcha Sudeep: ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక.. వద్దన్న స్టార్ హీరో కిచ్చా సుదీప్.. కారణమేంటంటే?
Kichcha Sudeep
Follow us
Basha Shek

|

Updated on: Jan 23, 2025 | 6:59 PM

కర్ణాటక ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర స్థాయి సినిమా అవార్డులు ప్రకటించింది. ఈ లిస్ట్‌లో స్టార్ హీరో సుదీప్‌కి ‘ఉత్తమ నటుడి’ అవార్డు దక్కింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సుదీప్ ఈ అవార్డును స్వీకరించడానికి ఇష్టపడడం లేదు. ‘పహిల్వాన్’ సినిమాలో నటనకు గాను కిచ్చా సుదీప్‌కి ‘ఉత్తమ నటుడు’ రాష్ట్ర అవార్డుకు ఎంపికయ్యాడు. అయితే ఈ అవార్డును స్వీకరించలేనంటన్నాడీ స్టార్ హీరో. ఈ మేరకు తన షాకింగ్ నిర్ణయం వెనుక గల కారణాన్ని లేఖ ద్వారా వివరించాడు సుదీప్. సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టిన హీరో ‘పహిల్వాన్ ‘ సినిమాలో తన నటనను గుర్తించినందుకు జ్యూరీలకు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. అదే సమయంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు తనకు కాకుండా వేరే ఆర్టిస్టులకు ఇవ్వాలని సుదీప్ కోరాడు.

‘‘ఉత్తమ నటుడి విభాగంలో రాష్ట్రస్థాయి అవార్డును అందుకోవడం నిజంగా విశేషం. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును నన్ను ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే కొన్నాళ్ల పాటు ఈ అవార్డులు తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఇందుకు పలు వ్యక్తిగత కారణాలున్నాయి. సినీ కళామతల్లికి తమ జీవితాలను అంకితం చేసిన ప్రతిభావంతులైన నటులు ఎందరో ఉన్నారు. ఈ గౌరవానికి నాకంటే వారే ఎక్కువ అర్హులు. వారిలో ఒకరికి ఈ గౌరవం లభిస్తే నేను మరింత సంతోషిస్తాను. ప్రేక్షకులను అలరించే నా పనిలో అవార్డుల కోసం ఆశలు లేవు. అయితే జ్యూరీలు నన్ను గుర్తించడం నాకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. నన్ను ఎంపిక చేసినందుకు జ్యూరీకి నేను ఎప్పటికీ కృతజ్ఞుడను. ఈ గుర్తింపు నిజమైన అవార్డు. నా నిర్ణయం పట్ల జ్యూరీ మెంబర్స్, రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ పెట్టి ఉండవచ్చు. అందుకే నేను క్షమాపణలు చెబుతున్నాను. మీరు నా నిర్ణయాన్ని గౌరవిస్తారని.. ఈ విషయంలో నాకు మద్దతు ఇస్తారని నాకు నమ్మకం ఉంది. నా కృషిని గుర్తించి ఈ అవార్డుకు పరిగణిస్తున్నందుకు గౌరవ జ్యూరీ సభ్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.’ అని ట్విట్ చేశారు సుదీప్.

ఇవి కూడా చదవండి

కిచ్చా సుదీప్ ట్వీట్..

సుదీప్ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఉత్తమ నటుడి పురస్కారాన్ని తిరస్కరించడం శాండల్ వుడ్ లో సంచలనంగా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.