టిల్లు పైనే బేబీ ఆశలు.. జాక్‌తో వైష్ణవి ట్రాక్ మారుతుందా..?

Rajeev

15 March 2025

Credit: Instagram

బేబీ సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసింది హీరోయిన్ వైష్ణవి చైతన్య.తొలి సినిమాతోనే మంచి వ్ విజయాన్ని అందుకుంది. 

ఈ భామకు నెట్టింట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

షార్ట్ ఫిల్స్మ్ ద్వారా యూట్యూబ్ స్టార్ గా ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ క్రేజ్ తోనే సినిమా ఆఫర్స్ అందుకుంది. 

ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది ఈ ముద్దుగుమ్మ.

ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన బేబీ సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది.

ఆ తర్వాత ఆశిష్ హీరోగా నటించిన లవ్ మీలో కనిపించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన అందుకుంది. 

ప్రస్తుతం సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న జాక్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాపై బోలెడన్ని ఆశలతో ఉంది వైష్ణవి.