Siddharth: సిద్ధార్థ్‌కి క్షమాపణలు చెప్పిన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్.. ఇకపై అలా జరగదని హామీ..
దక్షిణాదిలోని రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాల్లో ప్రెస్ మీట్స్ నిర్వహిస్తూ చిత్తా సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 28న సిద్ధార్థ్ బెంగుళూరులో ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే విలేకరుల సమావేశంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడకు చేరుకున్న కరవే సభ్యులు సిద్ధార్థ్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. వెంటనే ఇక్కడి నుంచి సిద్ధార్థ్ వెళ్లిపోవాలని.. తమిళ నటుడి సినిమాను కన్నడలో ప్రచారం చేయడానికి ఇది సరైన సమయం కాదంటూ వాదించారు. దీంతో సిద్ధార్థ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై సినీ ప్రముఖులు ఒక్కొ్క్కరిగా స్పందిస్తున్నారు.

హీరో సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం చిత్తా. ఈ సినిమాను తెలుగులో చిన్న పేరుతో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళంతోపాటు.. కన్నడ, మలయాళం భాషలలో ఈ మూవీని రిలీజ్ చేశారు. కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు సిద్ధార్థ్. దక్షిణాదిలోని రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాల్లో ప్రెస్ మీట్స్ నిర్వహిస్తూ చిత్తా సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 28న సిద్ధార్థ్ బెంగుళూరులో ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే విలేకరుల సమావేశంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడకు చేరుకున్న కరవే సభ్యులు సిద్ధార్థ్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. వెంటనే ఇక్కడి నుంచి సిద్ధార్థ్ వెళ్లిపోవాలని.. తమిళ నటుడి సినిమాను కన్నడలో ప్రచారం చేయడానికి ఇది సరైన సమయం కాదంటూ వాదించారు. దీంతో సిద్ధార్థ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై సినీ ప్రముఖులు ఒక్కొ్క్కరిగా స్పందిస్తున్నారు. ఒక హీరో సినిమా ప్రచారాన్ని కన్నడ ఆందోళనకారులు అడ్డుకోవడాన్ని తప్పుబడుతూ సిద్ధార్థ్ కు క్షమాపణలు చెప్పారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఇక ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ సైతం సిద్ధార్థ్ కు క్షమాపణలు తెలియజేశారు.
కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలు సంఘాలు చేపట్టిన కర్ణాటక బంద్ కు శివరాజ్ కుమార్ సంఘీభావం తెలియజేశారు. బెంగళూరులోని ఫిల్మ్ ఛాంబర్ సమీపంలోని గురురాజ్ కళ్యాణ మండపం వద్ద నిరసన తెలిపారు. శివన్న మాట్లాడుతూ.. “కావేరి జలాల సమస్య మొదటి నుంచి ఉంది. దాని గురించి పోరాడుతూనే ఉన్నాం. కావేరి జలాల సమస్యకు ఆర్టిస్టులు రాలేదని ఆరోపిస్తున్నారు. కళాకారులు వచ్చి ఐదు నిమిషాలు మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందా? మేము మీలాగే మనుషులం. స్టార్ డమ్ ఇచ్చింది మీరే. దాన్ని తీసేయండి. మేం వచ్చి మాట్లాడితే సమస్య పరిష్కారం కాదు’ అని శివన్న అన్నారు.
Karunada Chakravarthy @NimmaShivanna is extending a heartfelt apology to #Siddharth on behalf of the entire KFI for yesterday’s unfortunate incident.
VC: India Today#Shivanna #Shivarajkumar #Chittha #Chikku #CauveryIssue pic.twitter.com/z8PHgo1jfF
— Bhargavi (@IamHCB) September 29, 2023
‘ఈ సమస్యపై ప్రభుత్వాలు మాట్లాడాలి. రాజీ కుదుర్చుకోవాలి. రైతులు అన్ని చోట్లా ఒకేలా ఉన్నారు. అందరూ మాట్లాడితే పరిష్కారం దొరుకుతుంది. రోడ్డుపై వెళ్తున్న బస్సుపై రాయి వేస్తే నిరసనగా ఉంటుందా? పరభాషా హీరో విలేకరుల సమావేశాన్ని అడ్డుకున్నారు. అది ఎంతవరకు కరెక్ట్. సిద్ధార్థ్, నేను మీకు క్షమాపణలు చెబుతున్నాను. కర్ణాటక ప్రజలు ఎక్కడికి వెళ్లినా ఎంతో గౌరవంగా ఉంటారు. దానిని నిలబెట్టుకోవాలి. దయచేసి ఇబ్బంది పడకండి. నేను ఎప్పుడూ హృదయం నుండి మాట్లాడతాను. అందరితో మంచిగా ఉండాలి. రాలేదని, రాలేదని అనకండి’ అని శివరాజ్‌కుమార్ అన్నారు.
#WATCH | Bengaluru | Members of Karnataka Karnataka Rakshana Vedike Swabhimani Sene interrupted a press conference being held by actor Siddharth for his film ‘Chikku’ and demanded that he leave the venue. The members said that it was not an appropriate time for him to do this PC… pic.twitter.com/R2QXbxgbbR
— ANI (@ANI) September 28, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
