కంగనా ప్రేమ కవిత…ఎవరిపైనో తెలుసా…
కరోనా లాక్ డౌన్ కారణంగా మనాలిలోని తన ఇంట్లో గడుపుతోంది హీరోయిన్ కంగనా రనౌత్. ఈ సమయంలో ఆమె’ ఆస్మాన్’ అనే శీర్షికతో కూడిక కవితను రాసి అందర్నీ ఆశ్యర్యానికి గురిచేసింది. ఇటీవల మదర్స్ డే సందర్బంగా పసిబిడ్డ యొక్క దృక్కోణం స్పురించేవిధంగా తన తల్లి కోసం ఒక ప్రత్యేకమైన కవితను రాసింది. కంగనా తనలో ఉన్న సృజనాత్మకను ఉపయోగిస్తూ ప్రస్తుత కవితను ప్రజెంట్ చేసింది. కవితతో పాటు తాను వివరిస్తోన్న వీడియోను కూడా జతపరిచింది. కంగనా […]

కరోనా లాక్ డౌన్ కారణంగా మనాలిలోని తన ఇంట్లో గడుపుతోంది హీరోయిన్ కంగనా రనౌత్. ఈ సమయంలో ఆమె’ ఆస్మాన్’ అనే శీర్షికతో కూడిక కవితను రాసి అందర్నీ ఆశ్యర్యానికి గురిచేసింది. ఇటీవల మదర్స్ డే సందర్బంగా పసిబిడ్డ యొక్క దృక్కోణం స్పురించేవిధంగా తన తల్లి కోసం ఒక ప్రత్యేకమైన కవితను రాసింది. కంగనా తనలో ఉన్న సృజనాత్మకను ఉపయోగిస్తూ ప్రస్తుత కవితను ప్రజెంట్ చేసింది. కవితతో పాటు తాను వివరిస్తోన్న వీడియోను కూడా జతపరిచింది. కంగనా టీమ్ మెంబర్స్ ఆ కవితను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పద్యంలో ఆమె అనంతమైన ఆకాశం గురించి, దానిని మనం గుర్తించని భావోద్వేగాల గురించి మాట్లాడుతుంది. కంగనా ఉన్న మనాలీ ప్రాంతంలో చిత్రీకరించిన విజువల్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి.
వీడియోలో, కంగనా తన ఇంటితో ఏకాంతంగా గడపడం, పచ్చిక బైళ్లపై విహరించడం, ఒక కప్పు టీతో విశ్రాంతి తీసుకునేటప్పుడు ఆమె వ్యక్తిగత ఆలోచనలను రాయడం వంటి విజువల్స్ ఎంతో అందంగా ఉన్నాయి. ఈ వీడియోలో కంగనా అనేక డ్రస్సుల్లో మేకప్ లేకుండానే కనిపించింది.
#KanganaRanaut reveals another treasure from her innumerable talents. #AasmaanbyKangana has been penned and directed by her, and is truly food for thought in these testing times.#mondaythoughts pic.twitter.com/WXGwKtgGV9
— Team Kangana Ranaut (@KanganaTeam) May 18, 2020




