చిరంజీవి ఎత్తుకున్న ఈ టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో గుర్తుప‌ట్ట‌గ‌ల‌రా..?

ప్ర‌ముఖ నటుడు సాయి కుమార్ కుమారుడు ఆది ప్ర‌స్తుతం హీరోగా రాణిస్తోన్న విష‌యం తెలిసిందే. 2011 లో కె. విజయభాస్కర్ డైరెక్ష‌న్ లో వచ్చిన ప్రేమ కావాలి చిత్రంతో హీరోగా మారాడు ఆది. ఆ తర్వాత లేడీ డైరెక్ట‌ర్ బి. జయ దర్శకత్వంలో లవ్‌లీ (2012) అనే మూవీ చేశాడు. అయితే గత కొన్నేళ్లుగా ఈ కుర్ర‌హీరోకు స‌రైన హిట్ లేదు. ఇటీవ‌ల చేసిన‌ ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వ‌లేక‌పోయింది. […]

  • Ram Naramaneni
  • Publish Date - 3:11 pm, Tue, 19 May 20
చిరంజీవి ఎత్తుకున్న ఈ టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో గుర్తుప‌ట్ట‌గ‌ల‌రా..?

ప్ర‌ముఖ నటుడు సాయి కుమార్ కుమారుడు ఆది ప్ర‌స్తుతం హీరోగా రాణిస్తోన్న విష‌యం తెలిసిందే. 2011 లో కె. విజయభాస్కర్ డైరెక్ష‌న్ లో వచ్చిన ప్రేమ కావాలి చిత్రంతో హీరోగా మారాడు ఆది. ఆ తర్వాత లేడీ డైరెక్ట‌ర్ బి. జయ దర్శకత్వంలో లవ్‌లీ (2012) అనే మూవీ చేశాడు. అయితే గత కొన్నేళ్లుగా ఈ కుర్ర‌హీరోకు స‌రైన హిట్ లేదు. ఇటీవ‌ల చేసిన‌ ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం లాక్ డౌన్ కార‌ణంగా ఇంట్లో కుటుంబ స‌భ్యుల‌తో విలువైన
స‌మ‌యాన్ని గ‌డుపుతోన్న‌ ఆది తాజాగా ఓ అరుదైన‌ ఫోటోను తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు.

ఆ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి ఓ పిల్లాడిని ఎత్తుకుని ఉన్నాడు. అయితే ఆ పిల్లాడు ఎవ‌రో కాదు. ఆదినే. ఈ సందర్భంగా .. ‘కలికాలం’ సినిమా 100 రోజుల వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఆ పంక్ష‌న్ లో మెగాస్టార్ చేతుల మీదుగా తన తండ్రి సాయికుమార్‌కు తీసుకోవాల్సిన షీల్డ్‌ను ఆయన కొడుకు ఆదికి తీసుకున్నాడట. పిల్లాడుగా ఉన్న త‌న‌ను చిరంజీవి ఎత్తుకున్న ఫోటో షేర్ చేసి అప్పటి సంగతుల్నీ గుర్తు చేసుకున్నాడు ఆది. ఇక ‘కలికాలం’ సినిమా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 1991లో రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టింది.