కరోనా ఎఫెక్ట్: ఆగిపోనున్న సూపర్‌స్టార్ సినిమా.. దర్శకుడు ఏమన్నారంటే..!

కరోనా మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇక షూటింగ్‌లు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయన్న

కరోనా ఎఫెక్ట్: ఆగిపోనున్న సూపర్‌స్టార్ సినిమా.. దర్శకుడు ఏమన్నారంటే..!
Follow us

| Edited By:

Updated on: May 19, 2020 | 5:11 PM

కరోనా మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇక షూటింగ్‌లు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయన్న దానిపై ఎవ్వరికీ స్పష్టత లేదు. అయితే చిత్రీకరణలు మొదలైనా.. ప్రస్తుత పరిస్థితుల్లో వేరే దేశాల్లో షూటింగ్‌ జరపాలనుకున్న దర్శకనిర్మాతలకు మరో సవాల్‌ ఎదురుకానుంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు లభించాలి కాబట్టి. ఇలాంటి నేపథ్యంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో స్టార్ దర్శకుడు జీతూ జోసెఫ్‌ తెరకెక్కించాలనుకుంటున్న రామ్‌ సినిమా ఆగిపోనున్నట్లు ఈ మధ్యన వార్తలు వచ్చాయి. ఈ మూవీ చిత్రీకరణ ఇప్పటికే కొంచెం పూర్తి అయ్యింది. ఇక మిగిలిన షూటింగ్‌ను విదేశాల్లో చేయాల్సి ఉంది. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి వెళ్లడం కష్టం కాబట్టి ఈ సినిమాను జీతూ ఆపేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు పుకార్లు షికార్లు చేశాయి. ఈ క్రమంలో ఆ వార్తలపై దర్శకుడు క్లారిటీ ఇచ్చారు.

మోహన్‌లాల్‌తో తెరకెక్కిస్తోన్న రామ్‌ సినిమాను ఆపేసి, మరో ప్రాజెక్ట్‌కు నేను ప్లాన్ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వస్తోన్న వార్తలపై నాకు చాలా ఫోన్లు, మెసేజ్‌లు వస్తున్నాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్‌కు బ్రేక్ పడింది. లండన్‌, ఉబ్జెకిస్థాన్‌లో కరోనా తగ్గిన తరువాత ఈ మూవీ షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తాం. కరోనాను విజయవంతంగా ఎదుర్కున్న వాటిలో కేరళ కూడా ఉంది కాబట్టి.. ఇక్కడ కూడా సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ క్రమంలో సినిమా మొత్తాన్ని కేరళలోనే పూర్తి చేసే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో కూడా ఉన్నాము. అలాగని ఈ సినిమాను ఆపేసినట్లు కాదు అని స్పష్టం చేశారు. కాగా రామ్ సినిమాలో మోహన్‌లాల్ సరసన త్రిష నటిస్తోంది.

Read This Story Also:  గుడ్‌న్యూస్: ‘అశ్వగంధ’తో కరోనా నివారణ..!

https://www.facebook.com/JeethuJosephOnline/posts/879988132478086