నటి శ్రీదేవి ఇంటి పనిమనిషికి కరోనా పాజిటివ్..!
కరోనా మహమ్మారి కాటుకి ఎవరైనా ఒక్కటే.. సెలబ్రేటీల ఇల్లైనా.. సామాన్యుల ఇల్లైనా ఒక్కటే. ఎంత జాగ్రత్తలు తీసుకున్న కొవిడ్ 19 సోకుతోంది. తాజాగా ముంబైలోని అందాల నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ ఇంటి పనిమనిషికి అంటుకుంది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, అందాల అలనాటి నటి శ్రీదేవి ఇంట్లో పనిచేస్తున్న 23 ఏళ్ల యువకుడికి కరోనా పాజివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. బోనీకపూర్ ఇంట్లో పనిచేసే చరణ్ సాహూ శనివారం అస్వస్థతకు గురవడంతో వైద్య పరీక్షల కోసం […]

కరోనా మహమ్మారి కాటుకి ఎవరైనా ఒక్కటే.. సెలబ్రేటీల ఇల్లైనా.. సామాన్యుల ఇల్లైనా ఒక్కటే. ఎంత జాగ్రత్తలు తీసుకున్న కొవిడ్ 19 సోకుతోంది. తాజాగా ముంబైలోని అందాల నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ ఇంటి పనిమనిషికి అంటుకుంది.
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, అందాల అలనాటి నటి శ్రీదేవి ఇంట్లో పనిచేస్తున్న 23 ఏళ్ల యువకుడికి కరోనా పాజివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. బోనీకపూర్ ఇంట్లో పనిచేసే చరణ్ సాహూ శనివారం అస్వస్థతకు గురవడంతో వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి పంపించారు. అతడ్ని పరీక్షించిన ఆరోగ్య సిబ్బంది కరోనా పాజిటివ్ గా తేల్చడంతో.. ఐసోలేషన్‌లో ఉంచారు. విషయం తెలిసిన బీఎంసీ అధికారులు చరణ్ సాహును క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అయితే. తాను, తన కుమార్తెలు, ఇంట్లో ఉన్న ఇతర సిబ్బంది అందరం క్షేమంగా ఉన్నామని, తమకు ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని బోనీకపూర్ స్పష్టం చేశారు. బీఎంసీ, వైద్యాధికారుల సూనలను తాము విధిగా పాటిస్తున్నామన్నారు. చరణ్ సాహూ త్వరగా కోలుకుని తమ వద్దకు చేరతాడని బోనీ కపూర్ ఆశాభావం వ్యక్తం చేశారు.




