AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian 2 First Day Collections: భారతీయుడు 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. మొదటి రోజు ఎంత వచ్చాయంటే..

గతంలో సూపర్ హిట్ అయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీని రూపొందించారు డైరెక్టర్ శంకర్. కేవలం భారతీయుడు 2 మాత్రమే కాకుండా పార్ట్ 3 కూడా ఉందని సినిమా ప్రమోషన్లలో అనౌన్స్ చేశారు మేకర్స్. జూలై 12న ఇండియన్ 2 సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది.

Indian 2 First Day Collections: భారతీయుడు 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. మొదటి రోజు ఎంత వచ్చాయంటే..
Bharateeyudu 2
Rajitha Chanti
|

Updated on: Jul 13, 2024 | 11:26 AM

Share

డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విశ్వనాయకుడు కమల్ హాసన్ నటించిన సినిమా భారతీయుడు 2. దాదాపు ఆరేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ రెండు సంవత్సరాలు ఆగిపోయింది. ఆ తర్వాత స్టార్ట్ అయిన చిత్రీకరణ వేగంగా జరిగింది. విడుదలకు ముందే రిలీజైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించగా.. ఈ మూవీలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలకపాత్రలు పోషించారు. గతంలో సూపర్ హిట్ అయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీని రూపొందించారు డైరెక్టర్ శంకర్. కేవలం భారతీయుడు 2 మాత్రమే కాకుండా పార్ట్ 3 కూడా ఉందని సినిమా ప్రమోషన్లలో అనౌన్స్ చేశారు మేకర్స్. జూలై 12న ఇండియన్ 2 సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది.

మొదటిరోజే మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమాకు ఆ తర్వాత పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ ఈసారి ఇండియన్ 2 సినిమాలో శంకర్ మార్క్ మాత్రం మిస్సైందంటూ అడియన్స్ అభిప్రాయపడ్డారు. ఎప్పటిలాగే కమల్ హాసన్ తన నటనతో అల్లారించేశాడని.. అలాగే రకుల్, సిద్ధార్థ్ యాక్టింగ్ బాగుందంటూ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. అయితే ఈ మూవీ అడియన్స్ ఊహించినంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి నెట్టింట న్యూస్ వైరలవుతుంది.

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం భారతీయుడు 2 సినిమా మొదటి రోజు రూ.26.1 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిందట. తమిళంలో రూ. 16 కోట్లు రాగా.. తెలుగులో రూ.8 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక హిందీలో మరి తక్కువగానే వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కేవలం కోటి రూపాయలు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. విక్రమ్, కల్కి వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫాంలో ఉన్న కమల్ హాసన్ కు భారతీయుడు 2 సినిమా నిరాశపరిచిందనే చెప్పాలి. విక్రమ్ సినిమా మొదటిరోజు రూ.50 కోట్లకు పైగానే వసూలు చేయగా.. భారతీయుడు మాత్రం ఈ సినిమా కలెక్షన్లకు దరిదాపుల్లోకి కూడా చేరుకోలేకపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్