Kalki 2898 AD: కల్కి సినిమాపై కమల్ హాసన్ కామెంట్స్.. అభిమానులకు ఇలా షాకిచ్చాడేంటీ.. ?
డైరెక్టర్ నాగ్ అశ్విన్, నిర్మాత స్వప్న దత్ చేసిన కామెంట్స్ మూవీపై మరింత క్యూరియాసిటీని కలిగించాయి. మహాభారతం ఇతిహాసాల ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించామని గతంలోనే చెప్పుకొచ్చారు డైరెక్టర్. అలాగే ఇందులో ప్రభాస్ నటిస్తోన్న భైరవ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఇటీవల నిర్మాత స్వప్నదత్ అన్నారు. ఇదిలా ఉంటే.. కల్కి విషయంలో అభిమానులకు షాకిచ్చారు కమల్ హాసన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన మూడు సినిమాలపై అప్డేట్స్ ఇచ్చారు.

పాన్ ఇండియా మూవీ లవర్స్ ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898 AD. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, దీపికా పదుకొణె, కమల్ హాసన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కొన్నాళ్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు చివరిదశకు చేరుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ సినిమాపై హైప్ పెంచాయి. అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్, నిర్మాత స్వప్న దత్ చేసిన కామెంట్స్ మూవీపై మరింత క్యూరియాసిటీని కలిగించాయి. మహాభారతం ఇతిహాసాల ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించామని గతంలోనే చెప్పుకొచ్చారు డైరెక్టర్. అలాగే ఇందులో ప్రభాస్ నటిస్తోన్న భైరవ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఇటీవల నిర్మాత స్వప్నదత్ అన్నారు. ఇదిలా ఉంటే.. కల్కి విషయంలో అభిమానులకు షాకిచ్చారు కమల్ హాసన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన మూడు సినిమాలపై అప్డేట్స్ ఇచ్చారు.
కమల్ హాసన్ మాట్లాడుతూ.. కల్కి సినిమాలో తాను కేవలం అతిథి పాత్రలో కనిపించనున్నానని అన్నారు. అలాగే తన రోల్ షూటింగ్ కూడా కంప్లీ్ట్ అయ్యిందని అన్నారు. దీంతో ఈ మూవీలో కమల్ పాత్ర పెద్దగా స్కోప్ లేదని తెలిసి అభిమానులు నిరాశ చెందారు. అయితే డైరెక్టర్ నాగ్ అశ్విన్ కమల్ హాసన్ పాత్రను గెస్ట్ రోల్ అనుకున్నా.. అతడి పాత్ర ఇంపాక్ట్ మాత్రం ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే..ఇప్పటికే ఇండియన్ 2, ఇండియన్ 3 సినిమా షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయని.. ప్రస్తుతం ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. త్వరలోనే రిలీజ్ కానుందని అన్నారు.
ఆ తర్వాత ఇండియన్ 3 ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నామని అన్నారు. ఇక ఎన్నికల హడావిడి అయ్యాక మణిరత్నం తెరకెక్కిస్తున్న థగ్ లైఫ్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నామని అన్నారు. నిజానికి కల్కి సినిమాలో కమల్ హాసన్ నటిస్తున్నారని తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. దాదాపు 29 ఏళ్ల తర్వాత కమల్ నేరుగా తెలుగు సినిమాలో నటిస్తుండడంతో అభిమానులు సంతోషించారు.కానీ ఇప్పుడు కేవలం అతిథి పాత్ర అని తెలియడంతో ఫ్యాన్స్ కొంతమేర నిరాశ చెందినట్లుగానే తెలుస్తోంది. దాదాపు 600 కోట్ల రూపాయాలతో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఎన్నికల హడావాడి స్టార్ట్ కావడంతో ఈ మూవీ వాయిదా పడనుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ చిత్రబృందం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
