Indian 2 Movie: శంకర్ వర్సెస్ లైకా.. రంగంలోకి కమల్ హాసన్.. రాజీ కుదిరేనా మరి..

సూపర్ హిట్ సినిమా భారతీయుడు కు సీక్వెల్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదలు పెట్టిన దగ్గరనుంచి ఎదో ఒక అడ్డంకి ఏర్పడుతునే ఉంది.

Indian 2 Movie: శంకర్ వర్సెస్ లైకా.. రంగంలోకి కమల్ హాసన్.. రాజీ కుదిరేనా మరి..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 09, 2021 | 1:05 PM

Indian 2 Movie : సూపర్ హిట్ సినిమా భారతీయుడు కు సీక్వెల్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదలు పెట్టిన దగ్గరనుంచి ఎదో ఒక అడ్డంకి ఏర్పడుతునే ఉంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ లిమొదలు పెట్టిన కొద్దిరోజులకే అటకెక్కింది. దాంతో కమల్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి పొలిటికల్ గా బిజీ అవ్వాలని చూసారు. కానీ ప్లాన్ బెడిసికొట్టింది. లైకా సంస్థతో శంకర్ కి సమస్యలు తలెత్తడంతో కోర్టు గొడవల నేపథ్యంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ అర్థాంతరంగా నిలిచిపోవడంపై కమల్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పుడు చిక్కుల్లో పడి ఆగిపోయిన సినిమాలను పట్టాలెక్కించే బాధ్యతను తానే స్వయంగా తీసుకున్నారట కమల్ కోలీవుడ్ న్యూస్‌ అప్డేట్. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 రీమేక్‌ను గ్రాండ్‌గా స్టార్‌ చేశారు లోకనాయకుడు. కానీ వరుస అవాంతరాలతో ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దర్శకుడు శంకర్‌, నిర్మాణ సంస్థ లైకా మధ్య వివాదం మరింత ముదరటంతో ఇక ఆ సినిమా లేనట్టే అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్‌. అయితే ఇప్పుడు అన్ని సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకోవాలనుకుంటున్నారు కమల్‌ హాసన్. త్వరలో ఈ సమస్య ఓ కొలిక్కి వస్తుందనే భావిస్తున్నారు.

అంతేకాదు ఎన్నికలకు ముందే స్టార్ట్ చేసిన విక్రమ్ సినిమాను కూడా త్వరలోనే రీస్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు. లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Actress Sai Pallavi : అందాల సాయి పల్లవి అదిరిపోయే లుక్ రిలీజ్ చేసిన “శ్యామ్ సింగరాయ్” టీమ్..

Janhvi kapoor: డాక్ట‌ర్ అయ్యేంత తెలివి తేట‌లు నాకు లేవ‌ని చెప్పేశా.. ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన శ్రీదేవీ కూతురు..

Charmi About Her Marriage: జీవితంలో అలాంటి త‌ప్పు చేయ‌నంటున్న ఛార్మీ.. పెళ్లి వార్త‌ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..