Kajal Aggarwal: ఆ నొప్పిని ప్రేమతో భరించాను.. కాజల్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Sep 03, 2022 | 9:02 AM

టాలీవుడ్ చందమామ కాజల్ ఆగర్వాల్(Kajal Aggarwal)ను తిరిగి ఎప్పుడు సినిమాల్లో చూస్తామా అని ఆమె అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Kajal Aggarwal: ఆ నొప్పిని ప్రేమతో భరించాను.. కాజల్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Kajal Aggarwal

టాలీవుడ్ చందమామ కాజల్ ఆగర్వాల్(Kajal Aggarwal)ను తిరిగి ఎప్పుడు సినిమాల్లో చూస్తామా అని ఆమె అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన కాజల్.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. వరుసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా మారిపోయింది. కేవలం తెలుసుగులోనే కాదు.. తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ అందాల భామ. వరుస ఆఫర్లతో ఫుల్ ఫాంలో ఉన్న సమయంలోనే కాజల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. బాబు పుట్టిన తర్వాత పూర్తిగా తన సమయాన్ని అతనితో ఎంజాయ్ చేస్తున్న కాజల్.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది. స్టైలీష్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్‏లో ఉంటుంది.

అయితే దాదాపు సంవత్సరంపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కాజల్..ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందని టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆమె తన కుమారుడితో గడిపే సమయంలో తన అనుభవాలను పంచుకున్నారు. బాబు పుట్టిన తర్వాత తనని వదిలి షూటింగ్స్ కు వెళ్లాలంటే ప్రాణం పోయినట్టు ఉంటుందని కాజల్ చెప్పుకొచ్చింది. బాబును వదిలి క్షణమైనా ఉండలేకపోతున్నా అని అందుకే జిమ్ కు వెళ్లడం కూడా మానేశా అని ఆమె అంది. అలాగే ప్రతితల్లి తన బిడ్డకు పాలు పట్టాలనుకుంటుంది. ఆ సమయంలో చాలా నొప్పికలుగుతుంది. కానీ ఆ నొప్పి చాలా ఆనందంగా అనిపిస్తుందని..ఆ సమయంలో కలిగే ఫీలింగ్ ఎంతో అద్భుతంగా ఉంటుందని తాను కూడా ఆ నొప్పిని భరించాను అని తెలిపింది కాలేజ్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu