Lavanya Tripathi: నన్ను అలా చూసి ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతున్నారు, అందుకే ఈ మార్పు.. లావణ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Lavanya Tripathi: 'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార లావణ్య త్రిపాఠి. తొలి సినిమాలోనే తన క్యూట్, ఇన్నొసెంట్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ...
Lavanya Tripathi: ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార లావణ్య త్రిపాఠి. తొలి సినిమాలోనే తన క్యూట్, ఇన్నొసెంట్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించిందీ చిన్నది. ఇక కెరీర్ తొలినాళ్ల నుంచి లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌లో మాత్రమే నటిస్తూ వస్తోన్న ఈ బ్యూటీ తాజాగా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం లావణ్య ఓ పోలీస్ కథాంశంలో నటిస్తోంది.
ఇందులో యాక్షన్ సన్నివేశాలు కూడా పుష్కలంగా ఉండనున్నాయి. ఇందుకోసం గాను లావణ్య ఇప్పటికే ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. ఇలా తన క్యారెక్టర్ సెలక్షన్‌లో మార్పులు చేయడానికి గల కారణాన్ని లావణ్య చెప్పుకొచ్చింది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. ‘ప్రేమకథా చిత్రాల్లో నన్ను రక్షించడానికి హీరో ముందుకొచ్చేవాడు. ఇప్పుడు నేనే స్వీయరక్షణ చేసుకోవడం థ్రిల్‌గా ఫీలవుతున్నాను. తరుచూగా పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లో కనిపించేసరికి ప్రేక్షకులు కూడా బోర్‌గా ఫీలవుతున్నారు.
అందుకే కథల ఎంపికలో ప్రయోగాలు చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన విషయాలను మాత్రం లావణ్య పెద్దగా వెల్లడించలేదు. తమిళంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..