Aamir Khan: “అలా చేసి ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి”.. అమీర్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్

బాలీవుడ్ లో ఇటీవల విడుదలైన సినిమాలన్నీ పెవిలియన్ దారిపట్టాయి. ఒక్కటంటే ఒక్క సినిమా అయినా సాలిడ్ హిట్ అందుకుంటుందేమో అని చూస్తున్నా అది జరగడంలేదు.

Aamir Khan: అలా చేసి ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి.. అమీర్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్
Aamir Khan
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 03, 2022 | 8:46 AM

బాలీవుడ్ లో ఇటీవల విడుదలైన సినిమాలన్నీ పెవిలియన్ దారిపట్టాయి. ఒక్కటంటే ఒక్క సినిమా అయినా సాలిడ్ హిట్ అందుకుంటుందేమో అని చూస్తున్నా అది జరగడంలేదు. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా వరుసగా సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలుస్తున్నాయి. పైగా బాయ్ కాట్ అనే ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దాంతో దర్శక నిర్మాతలంతా ఆలోచనలో పడ్డారు. రీసెంట్ గా వచ్చిన లాల్ సింగ్ చడ్డా సినిమా పరిస్థితి కూడా అదే అయ్యింది. అమీర్ ఖాన్(Aamir Khan)నటించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి దారుణంగా నిరాశపరిచింది. . దాదాపు గత నాలుగేళ్లుగా కష్టపడ్డారు అమీర్. ఈ సినిమా కోసం మరే చిత్రాన్ని ఒప్పుకోలేదు. హాలీవుడ్ సూపర్ హిట్ ఫారెస్ట్ గంప్ చిత్రానికి రీమెక్‏గా తెరకెక్కిన ఈ ఈ మూవీ ఆగస్ట్ 11న విడుదలై మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది.

కానీ బాయ్ కాట్ సెగతో వసూళ్ల పరంగా దారుణంగా విఫలమయ్యింది. అయితే ఇప్పుడు సినిమా నష్టాన్ని భర్తీ చేసేందుకు అమీర్ ఖాన్ కీలకనిర్ణయం తీసుకున్నాడు. తన రెమ్యునరేషన్ మొత్తాన్ని ప్రొడ్యుసర్లకు తిరిగి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే తాజాగా చిత్రనిర్మాణ సంస్థ ప్రేక్షకులను క్షమాపణ కోరింది. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. లాల్ సింగ్ చడ్డా సినిమాను అమీర్ ఖాన్ ఆయన మాజీ భార్య కిరణ్ కలిసి నిర్మించిన విషయం తెలిసిందే. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ప్రేక్షకులను క్షమాపణ కోరుతూ ఈ పొడక్షన్స్ టీమ్ తమ ట్విట్టర్లో ” మనందరం మనుషులం కాబట్టి అందరం తప్పులు చేస్తాం. కొన్ని సార్లు మాటలు తప్పవుతాయి.. కొన్ని సార్లు చేతలు తప్పవుతాయి. కొన్ని సార్లు మనకు తెలియకుండానే తప్పులు జరుగుతాయి. కొన్ని సార్లు మన కోపంతో, మౌనంతో ఇతరులకు భాదను కలిగిస్తాం.. నేను ఎవరి మనోభావాలనైనా దెబ్బ తీసి ఉంటే క్షమించమని కోరుతున్నా’ అంటూ షారుక్ ఖాన్ నటించిన కల్ హోం నా హోం సినిమాలోని డైలాగ్స్ తో రాసుకొచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?