Disha Patani and Tiger Shroff : బాలీవుడ్‌లో మరో జంట బ్రేకప్.. కన్ఫామ్ చేసేసిన హీరో..
బాలీవుడ్ లో ప్రేమలు పెళ్లిళ్లు, విడాకులు, బ్రేకప్ లు ఇలాంటివి చాలా కామన్ అయిపోయాయి. లవ్ బర్స్డ్ గా ఉన్న వారు సడన్ గా బ్రేకప్ అంటూ షాక్ లు ఇస్తున్నారు.
బాలీవుడ్ లో ప్రేమలు పెళ్లిళ్లు, విడాకులు, బ్రేకప్ లు ఇలాంటివి చాలా కామన్ అయిపోయాయి. లవ్ బర్స్డ్ గా ఉన్న వారు సడన్ గా బ్రేకప్ అంటూ షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఇలా బ్రేకప్ చెప్పుకొని ఎవరిపని వారు చూసుకుంటున్నారు. తాజాగా మరో ప్రేమ జంట కూడా బ్రేకప్ చేసుకున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ , దిశాపటాని చాలా కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు చట్టపట్టాలేసుకు తిరగడం అందరికి తెలుసు. అయితే గత కొంతకాలంగా వీరి బ్రేకప్ కు సంబందించిన వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వీరి బ్రేకప్ ను కన్ఫామ్ చేశాడు హీరో టైగర్ ష్రాఫ్(Tiger Shroff ). తాజాగా వీరి ప్రేమ, బ్రేకప్ పై ఓపెన్ అయ్యాడు.
బాలీవుడ్ లో బడా నిర్మాత కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ అనే షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు ఈ షోలో పాల్గొని వారి వ్యక్తిగత విషయాలగురించి చెప్పుకొచ్చారు. ఒక వేళ వారు చెప్పకపోయినా కరణ్ ఎదో రకంగా వారి నుంచి నిజాలు, రహస్యాలు రాబడుతున్నాడు. తాజాగా ఈ షోకు టైగర్ ష్రాఫ్ హాజరయ్యాడు. టైగర్ ష్రాఫ్ హీరోపంథి సహనటి కృతి సనన్ తో కలిసి కరణ్ జోహార్ షో కాఫీ విత్ కరణ్ 7కి వచ్చారు. ఇక ఈ షోలో దిశాపటానితో రిలేషన్ గురించి కరణ్ ప్రశ్నించగా టైగర్ ఎదో చెప్పే ప్రయత్నం చేస్తూనే తాను సింగిల్ అని అన్నాడు. దాంతో వీరి బ్రేకప్ ను కన్ఫామ్ చేశాడు టైగర్. దాంతో బాలీవుడ్ ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..