AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తున్న కామన్ మ్యాన్ ఆదిరెడ్డి ఎవరో తెలుసా..?

బిగ్ బాస్  సీజన్ 6 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. లైఫ్ లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తర్వాతే అంటూ నాగ్ ఈ సీజన్ ను మరోసారి హుషారుగా హోస్ట్ చేయడనికి రెడీ అవుతున్నారు.

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తున్న కామన్ మ్యాన్ ఆదిరెడ్డి ఎవరో తెలుసా..?
Bigg Boss 6
Rajeev Rayala
|

Updated on: Sep 03, 2022 | 8:20 AM

Share

బిగ్ బాస్  సీజన్ 6(Bigg Boss 6 Telugu) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. లైఫ్ లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తర్వాతే అంటూ నాగ్ ఈ సీజన్ ను మరోసారి హుషారుగా హోస్ట్ చేయడనికి రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు 5 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఆరో సీజన్ లోకి అడుగుపెట్టింది. ఇక ఈ సీజన్ లో హౌస్ లోకి ఎవరు వెళ్ళబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 4నుంచి ఈ గేమ్ షో టెలికాస్ట్ అవ్వనుంది. ఇక ఇప్పటికే ఈ షో లో పటిస్పీట్ చేసే కంటెస్టెంట్స్ పేర్లు కన్ఫామ్ అయిపోయాయి కానీ వాళ్ళు ఎవరు అనేది మాత్రం బయటకు రాలేదు. అయితే కొన్ని పేర్లు మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోసుతున్నాయి.

వాటిలో ఆదిరెడ్డి అనే పేరు కూడా ఉంది . ఎవరు ఈ ఆదిరెడ్డి..? సెలబ్రేటీనా..? కాదు ఆదిరెడ్డి ఓ సామాన్యుడు. కామన్ మ్యాన్ క్యాటగిరీలో ఆదిరెడ్డి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆదిరెడ్డి బిగ్ బాస్ గేమ్ గురించి తన సొంత యూట్యూబ్ ఛానల్ లో విశ్లేషిస్తూ ఉంటాడు. అలా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఆదిరెడ్డి సొంతూరు నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని వరికుంట‌పాడు. ఆయనది వ్యవసాయ కుటుంబం. తల్లితండ్రులు, అన్నయ్య, అక్కచెల్లెలితో కలిసి ఉంటారు ఆదిరెడ్డి. నెల్లూరులో డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశారు ఆదిరెడ్డి.  ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కంతో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత అతడి తల్లి మరణించింది. దీంతో రెండేళ్ల పాటు ఇంట్లోనే ఉన్నారు..ఆ తరువాత ఉద్యోగం కోసం బెంగుళూరు వెళ్లారు.. ఆసమయంలోనే బిగ్ బాస్ సీజన్ 2 ను వివరిస్తూ ఓ వీడియో ను షేర్ చేశారు. ఆ వీడియో సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత వరుసగా వీడియోలు చేస్తూ తన సొంత యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేశారు. ఇలా బిగ్ బాస్ గురించి వివరించే ఆదిరెడ్డి ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే