War 2: యుద్ధభూమిలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. కొత్త లుక్ అదిరిపోయింది.. ఫోటోస్ వైరల్..

ఇదిలా ఉంటే.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు తారక్. బీటౌన్ కండల వీరుడు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న సినిమా వార్ 2. 2019లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వార్ సినిమాకు సీక్వెల్ గా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. మొదటి పార్టుకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా.. ఇప్పుడు రెండో పార్టుకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాది బ్రహ్మాస్త్ర సినిమాను తెరకెక్కించాడు అయాన్.

War 2: యుద్ధభూమిలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. కొత్త లుక్ అదిరిపోయింది.. ఫోటోస్ వైరల్..
Jr.ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 11, 2024 | 4:50 PM

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ తర్వాత మరోసారి డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఎప్పుడూ ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలం తర్వాత మాస్ రగ్గడ్ లుక్ లో యాక్షన్ హీరోగా బిగ్ స్క్రీన్ పై సంచలనం సృష్టించనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు తారక్. బీటౌన్ కండల వీరుడు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న సినిమా వార్ 2. 2019లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వార్ సినిమాకు సీక్వెల్ గా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. మొదటి పార్టుకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా.. ఇప్పుడు రెండో పార్టుకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాది బ్రహ్మాస్త్ర సినిమాను తెరకెక్కించాడు అయాన్.

ఇప్పటికే వార్ 2 ప్రాజెక్ట్ రెగ్యూలర్ షూటింగ్ పనులు జరుగుతున్నాయి. హృతిక్ రోషన్ తో కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కించారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట లీక్ అయ్యాయి. ఇక ఇందులో తారక్ ఎప్పుడెప్పుడు జాయిన్ అవుతారా ? అని వెయిట్ చేసిన ఫ్యాన్స్ నిరీక్షణకు ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేశాడు తారక్. తాజాగా ఈ మూవీ చిత్రీకరణలో జాయిన్ అయ్యేందుకు ముంబై బయల్దేరారు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఈరోజు ఎయిర్ పోర్టులో తారక్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. యశ్ రాజ్ ఫిలింస్ స్టూడియోలో సుమారు 10 రోజులపాటు వార్ చిత్రీకరణలో పాల్గొనున్నారు తారక్. ఈ మూవీ కోసం దాదాపు 60 రోజులు కేటాయించారు తారక్.

తారక్, హృతిక్ మధ్య భారీ యాక్షన్ సీన్స్ ఉండనున్నాయని.. ఇద్దరు కలిసి మొత్తం 30 రోజులపాటు షూటింగ్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఇందులో తారక్ రా ఏజెంట్ గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. ముంబైలో దాదాపు 10 రోజులపాటు ఒక ముఖ్యమైన సన్నివేశం చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఇక తారక్, హృతిక్ మధ్య వచ్చే సన్నివేశాలు ఏమాత్రం లీక్ కాకుండా ఇప్పటికే పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటుంది చిత్రయూనిట్. ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ మూవీని ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 14న రిలీజ్ చేయనున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న తారక్ ఇప్పుడు హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో తారక అరంగేట్రం చేయడం కోసం నార్త్ అడియన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. వార్ 2 తారక్ తొలి హిందీ సినిమా. దీంతో ఈ మూవీపై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తారక్ ప్రస్తుతం నటిస్తోన్న దేవర సినిమాను ఈ ఏడాదిలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?