AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

War 2 Twitter Review: వార్ 2 ట్విట్టర్ రివ్యూ.. ఎన్టీఆర్ ఇరగదీసిండంటగా..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ వార్ 2. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి.

Rajeev Rayala
|

Updated on: Aug 14, 2025 | 6:47 AM

Share

ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమా  నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. YRF స్పై యూనివర్స్ నుంచి వస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు ప్రపంచ వ్యాప్తగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవర్సీస్ నుంచి ఎటువంటి టాక్  వచ్చేసింది.. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా పై అభిపాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు.

ఎన్టీఆర్ తన నటనతో సినిమా రేంజ్ ను పెంచేశారు అని అంటున్నారు. అలాగే సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోయాయి అని సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు ప్రేక్షకులు. అలాగే పనిగట్టుకుని మరీ చెప్పాడు.. నో స్పాయిలర్స్ ప్లీజ్‌ అని.. సో హియర్ ఈజ్ మై విత్ అవుట్ స్పాయిలర్ షార్ట్ రివ్యూ..! పాయింట్ వైజ్‌ గా వస్తే.. ఎన్టీఆర్ ఎంట్రీ అదిరిపోయింది. జప్‌ అని దూసుకొచ్చే సీన్‌తో.. ల్యాండ్ అయ్యే సీన్‌తో.. థియేటర్లో ఫ్యాన్స్‌కైతే పిచ్చెక్కి పోద్ది! ఎన్టీఆర్ సన్నగా ఉన్నాడంటున్నారు కదా.. ఎంట్రీలోనే షర్ట్ లెస్‌ షార్ట్ ఉంటది.. చూడగానే అందరూ స్టన్‌ అవ్వడం పక్కా! ఎన్టీఆర్‌ అంత కాదు కానీ.. హృతిక్ ఎంట్రీ కూడా అదిరిపోయింది. ఇద్దరూ ఫుల్ యాక్షన్ మోడ్‌లోనే ఆడియన్స్‌ను పలకరిస్తారు. వీళ్ల ఎంట్రీని మ్యాచ్ చేస్తూ సంచిత్ అండ్ అంకిత్ బీజీఎమ్‌తో ఇచ్చిపడేశాడు. ఎన్టీఆర్ అండ్ హృతిక్.. ఈ సినిమాకు ది బెస్ట్ లుక్ ఇచ్చారు. యాక్షన్లో అయితే నువ్వా నేనా.. అన్నట్టు ఢీకొన్నారు. ఈ యాక్షన్ సీన్స్‌ను కూడా డైరెక్టర్‌ హాలీవుడ్‌ రేంజ్‌లో తెరకెక్కించారు. సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్‌ చాలు.. సినిమా హండ్రెడ్ పర్సెంట్ వర్త్‌ అని అనిపించడానికి. స్పెషల్లీ విక్రమ్‌ వర్సెస్ కబీర్.. వీళ్లద్దరూ ఎదురుపడి పోట్లాడుకునే ఎపిసోడ్‌ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కొన్ని సీన్స్‌లో హృతిక్‌ను ఎన్టీఆర్‌ డామినేట్ చేస్తే.. మరి కొన్ని సీన్లలో ఆయన ఈయన్ని డామినేట్ చేస్తారు. ఇక సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది.

ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కూడా నెక్ట్స్‌ లెవల్లోనే ఉంది. కియారా ఉన్నకాడికి బాగా చేసింది. మసాలా ప్రియులకైతే ఈమె తెగ నచ్చేస్తుంది. అండ్ ఫైనల్‌గా డ్యాన్స్ విషయానికి వస్తే.. సలామే సాంగ్‌లో.. ఈ ఇద్దరూ పోటాపోటీగైతే డ్యాన్స్ చేశారు. అయితే నాటు సాంగ్‌తో మాత్రం కంపేర్ చేయకండి మన ఊపు వేరే! ప్రీతమ్ కంపోజ్ చేసిన ఊపిరి ఊయలగా సాంగ్ విజువల్‌గా అట్రాక్టివ్‌గా ఉంది. అయాన్ ముఖర్జి డైరెక్షన్ బాగుంది. హాలీవుడ్ సినిమా చూసినట్టే ఉంటుంది. డబ్బింగ్ పర్లేదు. డైలాగ్స్‌ మాగ్జిమమ్‌ సెట్టు అయ్యాయి. అండ్ ఈ సినిమాలో ఎవరు హీరో? ఎవరు విలన్? ఎన్టీఆర్ క్యారెక్టర్ షేడ్ ఏంటన్నది మాత్రం సస్పెన్స్ . ఇవి తెలుసుకోవాలంటే మీరు థియేటర్‌కు వెళ్లాల్సిందే! అంటున్నారు ప్రేక్షకులు

వార్ 2

వార్ 2 ట్విట్టర్ రివ్యూ..

వార్ 2 ట్విట్టర్ రివ్యూ..

వార్ 2 ట్విట్టర్ రివ్యూ..

వార్ 2 ట్విట్టర్ రివ్యూ..

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..