Jr.NTR: అభిమానికి షాకిచ్చిన ఎన్టీఆర్.. నెక్ట్స్ సినిమా చేయను.. ఆపేస్తానంటూ..

ఇటీవల అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్లోనూ ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ అప్డేట్ కావాలంటూ ఫ్యాన్స్ రచ్చ చేశారు. తాజాగా విశ్వక్ సేన్ నటించిన దమ్కీ ప్రీ రిలీజ్ వేడుకలోనూ మరోసారి అప్డేట్స్ విషయాన్ని తీసుకువచ్చాయి.

Jr.NTR: అభిమానికి షాకిచ్చిన ఎన్టీఆర్.. నెక్ట్స్ సినిమా చేయను.. ఆపేస్తానంటూ..
Jr.ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 18, 2023 | 9:28 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్‏కు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తారక్ కోసం ప్రాణాలిచ్చేందుకు సైతం ముందుంటారు. ఇక తమ అభిమాన హీరో సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన తారక్.. ఇప్పటివరకు తదుపరి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు. ట్రిపుల్ ఆర్ వచ్చి ఏడాది దాటినా.. తారక్ మరో సినిమా సెట్ లో అడుగుపెట్టలేదు. దీంతో సినిమా అప్డేట్స్ కోసం వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ ఓ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి… కానీ రెగ్యూలర్ షూటింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు. దీంతో ఫ్యాన్స్ అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. ఎన్టీఆర్, కొరటాల శివ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఇస్తారేమో అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తారక్ ఎక్కడా కనిపించినా నెక్ట్స్ మూవీ అప్డేట్స్ అడుగుతున్నారు. ఇటీవల అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్లోనూ ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ అప్డేట్ కావాలంటూ ఫ్యాన్స్ రచ్చ చేశారు. తాజాగా విశ్వక్ సేన్ నటించిన దమ్కీ ప్రీ రిలీజ్ వేడుకలోనూ మరోసారి అప్డేట్స్ విషయాన్ని తీసుకువచ్చాయి.

విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చారు తారక్. ఈ వేడుకలో ఓ అభిమాని ఎన్టీఆర్ 30 గురించి అప్డేట్ ఇవ్వాలంటూ గట్టిగా అరిచాడు. దానికి తారక్ రియాక్ట్ అవుతూ.. “నేను నెక్ట్స్ సినిమా చెయ్యట్లేదు. ఏమి.. ఎన్నిసార్లు చెప్తారు. మొన్ననే చెప్పానుగా. మీరు ఇలాగే అడిగితే నెక్ట్స్ సినిమా చెయ్యట్లేదనే చెప్పా. ఆపేస్తాను కూడా” అంటూ నవ్వుతూ అన్నారు తారక్. ఆ తర్వాత కంటిన్యూ చేస్తూ నేనెలా ఆపేస్తాను సినిమాలు. నేను ఆపేస్తే మీరు ఊరుకుంటారా.. త్వరలోనే ఉంటుంది ” అని అన్నారు.

ఇదిలా ఉంటే.. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఎన్టీఆర్ 30 సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతో జాన్వీ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఇక ఇందులో బీటౌన్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ చిత్రానికి అనిరుదు రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ