Jr. NTR: ఎన్టీఆర్‌పై చేతబడి.. అందుకే అలా అయ్యిందా.? తారక్ ఏమన్నారంటే
జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వరస సినిమాలతో పాన్ ఇండియా లెవల్‌లో దూసుకెళ్తున్నాడు. వరసగా హిట్స్ అందుకుంటూ, తన నటనతో దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇక దేవర మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న తారక్ వార్ 2తో ప్రేక్షకులను మెప్పించారు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఇటీవలే వార్ 2 సినిమాలో నటించిన విషయం తెలిసిందే.. బాలీవుడ్ దర్శకుడు తెరకెక్కించిన వార్ 2 సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. కేజీఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత సాలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. సలార్ సినిమాను ప్రశాంత్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నడు. ఇక ఈ సినిమాలతో పాటు ఎన్టీఆర్‌తో సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇటీవలే ఎన్టీఆర్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ తన ప్రమాదంపైఓ ఇంటర్యూలో మాట్లాడారు. ప్రమాదం జరిగినప్పుడు తాను, తన స్నేహితులు తాగి వాహనం నడిపారని కొన్ని మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగిందని, అలాగే ఇది ర్యాష్ గా డ్రైవింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్ వల్ల జరిగిందని కూడా వార్తలు వచ్చాయి.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అన్నారు తారక్. కొంతమంది నిజం తెలియకుండా మాట్లాడటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాను మద్యం సేవించానా.? లేదా.? అన్నది డాక్టర్లకు తెలుసని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఒకవేళ తాను మద్యం తాగి ఉంటే, కిమ్స్ ఆసుపత్రిలో తనకు అనెస్థీషియా ఎందుకు ఇస్తారు.?, సర్జరీ ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. ఈ విషయాలపై ఎవరికైనా డౌట్స్ ఉంటే కిమ్స్ వైద్యులను అడిగి తెలుసుకోవచ్చని అన్నారు. తాను చక్కగా భోజనం చేసి కారు ఎక్కానని, కనురెప్ప మూసి తెరిచేలోగా ప్రమాదం జరిగిపోయిందని అంతే కాదు ఎన్టీఆర్ మీద చేతబడి జరిగింది. అందుకే యాక్సిడెంట్ అయ్యింది. తాగి నడిపారు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రచారాలు మానుకోవాలి. ఈ ప్రమాదంలో ఎవరి తప్పు లేదని, ఇది అనుకోకుండా జరిగిందని ఆయన స్పష్టం చేశారు. మీడియాలో అనవసరపు ప్రచారాలు చేసే వారిని తమ జీవితాలపై దృష్టి పెట్టమని హితవు పలికారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




