నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగుల ప్రపంచంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన నందమూరి అభిమానులకు ఈరోజు గుడ్ న్యూస్ షేర్ చేశారు. హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి సినిమా చేయనున్నాడు. ఈరోజు (సెప్టెంబర్ 6న) మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అలాగే తన ప్రాజెక్టులో మోక్షజ్ఞ లుక్ కూడా రివీల్ చేస్తూ ఓ పోస్టర్ షేర్ చేశారు. అందులో బాలయ్య తనయుడు స్టైలీష్ లుక్లో.. ఫ్యాన్స్ అసలు ఊహించని రేంజ్లో కనిపించాడు. దీంతో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ సినిమా అదిరిపోతుందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మోక్షజ్ఞను సినిమాల్లోకి తీసుకురావడం అనేది చాలా పెద్ద బాధ్యతతో కూడిన గౌరవం అని.. తనపై, తన కథపై బాలకృష్ణ పెట్టుకున్న నమ్మకానికి తాను ఎప్పుడూ కృతజ్ఞుడినే అని అన్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
ఇదిలా ఉంటే.. మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం పై జూనియ్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పందించారు. మోక్షజ్ఞకు బర్త్ డే విషెస్ తెలియజేయడంతోపాటు మొదటి సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు. “సినీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నందుకు అభినందనలు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న క్రమంలో మీకు అన్ని దైవిక శక్తులతోపాటు తాతగారి ఆశీర్వాదం కూడా ఉంటుంది. హ్యాపీ బర్త్ డే మోక్షు” అంటూ ట్వీట్ చేశారు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ ట్వీట్..
Congratulations on your debut into the world of cinema!
May all the divine forces along with Thatha garu, shower blessings upon you as you begin a new chapter in your life!Happy birthday Mokshu @MokshNandamuri pic.twitter.com/5LOBVLn862
— Jr NTR (@tarak9999) September 6, 2024
ఇక నందమూరి కళ్యాణ్ రామ్ రియాక్ట్ అవుతూ.. “సినిమా ప్రపంచంలోకి స్వాగతం మోక్షు.. తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను… హ్యాపీ బర్త్ డే” అంటూ ట్వీట్ చేశారు. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న సినిమాటిక్ యూనివర్స్ లో మోక్షజ్ఞ సినిమా కూడా ఓ భాగమే. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ పై నిర్మిస్తున్నారు.
కళ్యాణ్ రామ్ ట్వీట్..
Welcome to the Tinsel Town Mokshu !!
తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను…
Wish you a very very Happy Birthday!! pic.twitter.com/77PfROmkoJ
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) September 6, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.