Jeevitha Rajashekar: సినిమా రేట్లపై స్పందించిన జీవితా రాజశేఖర్.. పెద్ద సినిమాలకు తప్పదంటూ..
నన్ను అందరూ ఐరన్ లేడీ అంటున్నారు.. జీవితంలో ఎన్నో విషయాల్లో పోరాడుతూ వచ్చాను.. ఇంకా పోరాడుతున్నాను.
సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం శేఖర్. ఈ సినిమాలో ఆయన కూతురు శివాని కీలకపాత్రలో నటిస్తుండగా..జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తైన ఈ మూవీ మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ షూరు చేశారు మేకర్స్..ఈ క్రమంలో మే 17న శేకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. సినిమా టికేట్ రేట్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
జీవితా మాట్లాడుతూ… “నన్ను అందరూ ఐరన్ లేడీ అంటున్నారు.. జీవితంలో ఎన్నో విషయాల్లో పోరాడుతూ వచ్చాను.. ఇంకా పోరాడుతున్నాను.. ఎవరికీ మోసం చేయలేదు.. సాయం చేశాను..అందుకే ఇక్కడి ఇంత మంది వచ్చారు.. మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే వచ్చారు.. తప్పకుండా ఈ సినిమాను కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను.. టికెట్స్ రేట్స్ భారీగా పెరగడం వలన థియేటర్లకు జనాలు రావడం లేదని విన్నాను.. రేట్స్ పెంచడం అనేది పెద్ద సినిమాలకు తప్పదు.. మా సినిమాకు థియేటర్ రేట్లు పెంచడం లేదు.. ప్రభుత్వం చెప్పిన ధరకే అమ్ముతున్నాం.. మీకు అందుబాటులోనే టికెట్ రేట్లు ఉంటాయి.. మే 20న సినిమాను తప్పకుండా చూడండి”.. అంటూ చెప్పుకొచ్చారు .