AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: జాన్వీ కపూర్ కత్తిలాంటి లుక్ అదిరిపోయింది.. దేవర నుంచి తంగం పోస్టర్ రిలీజ్..

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పుట్టినరోజు నేడు (మార్చి 6). ఈ సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్, సెలబ్రేటీస్. మరోవైపు జాన్వీ నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా దేవర పార్ట్ 2 నుంచి తంగం పోస్టర్ షేర్ చేస్తూ జాన్వీకి బర్త్ డే విషెస్ తెలిపారు మేకర్స్.

Janhvi Kapoor: జాన్వీ కపూర్ కత్తిలాంటి లుక్ అదిరిపోయింది.. దేవర నుంచి తంగం పోస్టర్ రిలీజ్..
Janhvi Kapoor
Rajitha Chanti
|

Updated on: Mar 06, 2025 | 10:19 PM

Share

గతేడాది యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మ్యాన్ ఆఫ్ మాసెస్ నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్.. దసరా కానుకగా విడుదల భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో తారక్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది జాన్వీ. ఈ సినిమాలో అచ్చతెలుగు పల్లెటూరి అమ్మాయిగా కనిపించి అందం, అభినయంతో కట్టిపడేసింది. ప్రస్తుతం దేవర పార్ట్ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మరోవైపు ఎన్టీఆర్ వార్ 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈరోజు జాన్వీ కపూర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ దేవర నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేసింది.

మార్చి 6న జాన్వీ కపూర్ 28వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు అభిమానులు, సినీప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే ఆర్సీ 16 సినిమా నుంచి సైతం జాన్వీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇటు దేవర టీం సైతం ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ తంగం పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్ షేర్ చేసింది. ఇందులో జాన్వీ కపూర్ భుజాన చేపలను తగిలించుకుని .. నోటితో కత్తిని పట్టుకుని కనిపించింది. కోర చూపులు చూస్తూ కుర్రాళ్లను కట్టిపడేస్తుంది జాన్వీ. దీంతో ఈ బ్యూటీ లుక్స్ పై క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం రిలీజ్ చేసిన జాన్వీ కపూర్ పోస్టర్ నెట్టింట వైరలవుతుంది. దీంతో దేవర పార్ట్ 2లో జాన్వీ పాత్రపై మరింత క్యూరియాసిటీ నెలకొంది. డైరెక్టర్ కొరటాల ప్రస్తుతం దేవర పార్ట్ 2 ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నట్లు సమాచారం.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..