Janhvi Kapoor: ఆ స్టార్ హీరో నాకన్నా చిన్నోడిలా కనిపిస్తాడు.. జాన్వీ క్రేజీ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
ప్రస్తుతం ఉన్న యూత్ కి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.. ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ తోనే ఆమె మిలియన్ల కొద్దీ అభిమానులని సొంతం చేసుకుంది. శ్రీదేవి కుమార్తె అనే బ్రాండ్ ఉన్న తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు.

బాలీవుడ్ ముద్దగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా హిందీలో రాణిస్తుంది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లొనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతుంది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలో జాన్వీ అందాలకు యమా క్రేజ్ ఉంది. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ చిన్నది. ఇక ఈ బ్యూటీ దేవర సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో పాటు అందంతోనూ మెప్పించి మంచి మార్కులు కొట్టేసింది జాన్వీ. ఇక ఇప్పుడు ఈ అమ్మడు దేవర 2లో నటిస్తుంది. అలాగే రామ్ చరణ్ తోనూ నటిస్తుంది.
ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జాన్వీ కపూర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరో గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆయన వయసు రోజు రోజుకు తగ్గుతుంది అని చెప్పుకొచ్చింది. ఇంతకూ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా.? మీరు గెస్ చేసే ఉంటారు ఆయన ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మహేష్ గురుంచి జాన్వీ మాట్లాడింది.
మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.. ఆయనకు వయసు అవ్వదు. ఆయనకు రోజు రోజుకు వయసు తగ్గిపోతుంది. ఎంతో హ్యాండ్సమ్ గా ఉంటారు. కొన్నిసార్లు నా కన్నా చిన్నవాడిగా కనిపిస్తారు అని తెలిపింది జాన్వీ. ఈ కామెంట్స్ ను మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. మహేష్ ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఒడిశాలో షూటింగ్ పూర్తి చేశారు టీమ్. అలాగే జాన్వీ ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..