Actor Vinayakan: ‘జైలర్ ‘ విలన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. డాక్టర్లు ఏమంటున్నారంటే?

ర‌జ‌నీకాంత్ జైల‌ర్ సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళ నటుడు వినాయకన్. అయితే ఆ క్రేజ్ ను పాడు చేసుకుంటూ పలు సార్లు గొడవలతో వార్తల్లో నిలిచాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. మద్యం మత్తులో నానా హంగామా చేసి అరెస్ట్ కూడా అయ్యాడు.

Actor Vinayakan: జైలర్  విలన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
Actor Vinayakan

Updated on: Dec 25, 2025 | 2:39 PM

ప్రముఖ మలయాళ నటుడు, ‘జైలర్’ ఫేమ్ వినాయకన్ ప్రమాదానికి గురయ్యారు. ఓ సినిమా షూటింగ్ లో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. యాక్షన్ సన్నివేశాల సంబంధించిన స్టంట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో వినాయకన్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సినిమా యూనిట్ సిబ్బంది వెంటనే ఆయనను కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం నటుడికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. అయితే వైద్యులు చెప్పిన సమాచారం ప్రకారం.. వినాయకన్‌ను సమయానికి ఆస్పత్రికి తీసుకొచ్చినా ఇంటర్నల్ గా తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. భుజం, మెడలో నరాలు, కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వినాయకన్ కు చికిత్స కొనసాగుతోందని, ఆయనకు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. వినాయకన్ ప్రస్తుతం ఆడు 3 సినిమా షూటింగ్ లో నటిస్తున్నారు. ఇప్పుడీ సినిమా షూటింగ్ లోనే ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ‘ఆడు 3’ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఆడు 3 సినిమాలో జయసూర్య హీరోగా నటిస్తున్నాడు. మిధున్ మాన్యువల్ థామస్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో వినాయకన్ విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయనకు ప్రమాదం జరగడంత సినిమా షూటింగ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. వినాయకన్ త్వరగా కోలుకుని మళ్లీ సినిమాల్లోకి రావాలని సినీ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కాగా వినాయకన్ గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించాడు. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన అసాధ్యుడుతో పాటు జేమ్స్ మూవీలోనూ విలన్ గా మెప్పించారు. హిందీలోనూ కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఇక జైలర్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయాడీ సీనియర్ యాక్టర్.

ఇవి కూడా చదవండి

అయితే నటుడు వినాయకన్ ఈ మధ్యన తరచూ వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. మద్యం మత్తులో నానా హంగామా చేస్తూ ఇతరులతో గొడవలకు దిగుతున్నాడు. ఆ మధ్యన చ్చి విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగడం కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒక కేసులో పోలీసులు కూడా అతనిని అరెస్ట్ చేసి ఆపై విడుదల చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి