Rajinikanth: లుక్ సీరియస్‌గా.. సినిమాలో కథ మాత్రం కామిక్‌గా.. నెల్సన్ దిలీప్ స్టైలే వేరప్పా..
తలైవా హీరోగా నెల్సన్ రూపొందిస్తున్న జైలర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ లుక్ చూశాక... నెల్సన్ మేకింగ్ స్టైల్ విషయంలో ఇంట్రస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది.

Kollywood: కోలీవుడ్ నయా సెన్సేషన్ నెల్సన్ దిలీప్,.. కొత్త సినిమా షురూ చేశారు. కేవలం మూడు సినిమాల అనుభవం మాత్రమే ఉన్న యంగ్ డైరెక్టర్‌కు ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఛాన్స్ ఇచ్చారు. తలైవా హీరోగా నెల్సన్(Nelson Dilipkumar) రూపొందిస్తున్న జైలర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ లుక్ చూశాక… నెల్సన్ మేకింగ్ స్టైల్ విషయంలో ఇంట్రస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. డాక్టర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు దర్శకుడు నెల్సన్ దిలీప్. శివ కార్తికేయన్(Sivakarthikeyan) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఆఫ్టర్ కోవిడ్ సంచలన విజయం సాధించింది. ఈ మూవీ 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వటంతో స్టార్ హీరోలు కూడా నెల్సన్ మీద దృష్టి పెట్టారు. డాక్టర్ సినిమా రిలీజ్‌కు ముందు ట్రైలర్ పోస్టర్స్ చూసిన ఆడియన్స్ ఈ సినిమా సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ అని ఫీల్ అయ్యారు. కానీ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్ కావటంతో ఆడియన్స్ సర్‌ప్రైజ్ ఫీల్ అయ్యారు.
డాక్టర్ ఫార్ములా వర్క్ అవుట్ కావటంతో నెక్ట్స్ బీస్ట్‌ను కూడా అలాగే ప్రమోట్ చేశారు నెల్సన్. దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ సినిమా ట్రైలర్‌ను భారీ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ అన్న రేంజ్‌లో కట్ చేశారు మేకర్స్. అయితే సినిమాలో యాక్షన్ సీన్స్ అదే రేంజ్‌లో ఉన్నా… కామెడీనే ఎక్కువగా హైలెట్ అయ్యింది. అదే సమయంలో నెల్సన్ ఖాతాలో మరో బిగ్ హిట్ కూడా పడింది. వరుస బ్లాక్ బస్టర్స్‌తో రజనీకాంత్ దృష్టిలో పడిన నెల్సన్… తలైవాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. తాజాగా రజనీ హీరోగా జైలర్ సినిమా షూటింగ్ ప్రారంభించారు ఈ యంగ్ డైరెక్టర్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రజనీ సీరియస్ లుక్‌లో రఫ్ అండ్ టఫ్‌గా కనిపిస్తున్నారు. అయితే లుక్ చూసిన ఆడియన్స్… ప్రజెంట్ ప్రమోషన్ ఎలా ఉన్నా… సినిమాలో మాత్రం కామెడీనే మెయిన్ ఎట్రాక్షన్ అవుతుందని ఫిక్స్ అయ్యారు. మరి నెల్సన్ ముచ్చటగా మూడోసారి తన ఫార్ములాను రిపీట్ చేస్తారేమో చూడాలి.

Nelson Dilipkumar
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
