AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagapathi Babu: నా కోసం ఆ హీరో తన పొలం అమ్మి డబ్బులు ఇస్తా అన్నాడు.. జగపతి బాబు..

ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరైన నటుడు జగపతి బాబు. ప్రస్తుతం తండ్రిగా, తాతగా కనిపిస్తూనే.. మరోవైపు విలన్ పాత్రలతో అదరగొట్టేస్తున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా జగపతి బాబు ఓల్డ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Jagapathi Babu: నా కోసం ఆ హీరో తన పొలం అమ్మి డబ్బులు ఇస్తా అన్నాడు.. జగపతి బాబు..
Jagapathi Babu
Rajitha Chanti
|

Updated on: Jan 29, 2026 | 1:53 AM

Share

ప్రముఖ నటుడు జగపతి బాబు గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబ జీవితం, సినీ పరిశ్రమలోని స్నేహాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కుటుంబం, పిల్లల పెంపకం గురించి మాట్లాడుతూ, తన ఇద్దరు కుమార్తెలు ఎప్పుడూ ఆర్థిక విషయాలపై తనతో చర్చించలేదని జగపతి బాబు తెలిపారు. తన పెద్ద కుమార్తె అయితే తమను సరిగ్గా పెంచలేదని, కావాల్సింది ఇచ్చి ఇష్టమొచ్చినట్టు వదిలేశారని, కొట్టి తిట్టి ఉంటేనే జీవితాన్ని నేర్చుకునేవారమని చెప్పిందని వివరించారు. ఈ మాటలు తనకు సంతోషాన్ని ఇచ్చాయని, ఎప్పుడూ “నీవు ఇలా చేశావ్, అలా చేశావ్” అని నిందించలేదని పేర్కొన్నారు. మనవడు లేకపోవడంపై తన తండ్రితో జరిగిన సంభాషణను గుర్తుచేసుకుంటూ, తమ ముగ్గురు సోదరులకు ఐదుగురు ఆడపిల్లలు మాత్రమే ఉన్నారని, వారసత్వం గురించి ఆయన ఆందోళన చెందారని చెప్పారు. అయితే, “వీరమాచనేని కుటుంబం లేకపోతే ఏమవుతుంది? ఎవడికీ పెద్ద తేడా ఉండదు. మనం ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు,” అని తాను తన తండ్రికి చెప్పానని తెలిపారు. తనకు వారసత్వంపై కోరికలు లేవని, కొడుకు ఉంటే హీరో చేసేవాణ్ణి అనే ఆలోచన కూడా రాలేదని స్పష్టం చేశారు.

సినీ పరిశ్రమలో స్నేహాల గురించి ప్రస్తావిస్తూ, “పర్మనెంట్ శత్రుత్వాలుండవు, పర్మనెంట్ మిత్రత్వాలు ఉండవు” అనే సూత్రాన్ని గుర్తుచేసుకున్నారు. అయితే, తన జీవితంలో అర్జున్ సర్జా, జూనియర్ ఎన్టీఆర్ (తారక్) వంటి కొందరు వ్యక్తులు నిజమైన స్నేహితులుగా నిలిచారని తెలిపారు. ఒక దశలో తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, తన పొలం అమ్మి డబ్బులు ఇస్తానని అర్జున్ సర్జా ఆఫర్ చేశాడని జగపతి బాబు గుర్తు చేసుకున్నారు. అదృష్టవశాత్తు ఆ పరిస్థితి అవసరం పడలేదని, కానీ అర్జున్ ఆ గొప్ప మనసు చూపారని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా తనకంటే చిన్నవాడైనా, తన బాగోగులు చూసుకుంటాడని ఆప్యాయతను వ్యక్తం చేశారు. స్నేహానికి ఒక పరిమితి ఉంటుందని, తన సొంత సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ తమ గురించి మాత్రమే ఆలోచిస్తారని ఆయన చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..

వివేక్ ఒబెరాయ్ సినిమా కోసం పూణే రమ్మని ఒక అమ్మాయికి ఆఫర్ రాగా, తనకి ఏదో తేడాగా అనిపించి ఆమెను వెళ్లవద్దని ఆపేశానని తెలిపారు. ఆ తర్వాత మూడు రోజులకే ఆ ముఠా పట్టుబడిందని, కిడ్నాప్ చేసి, మదర్‌ను చంపి, 17 మంది రేప్ చేసి పాకిస్తాన్‌కు పంపించాలనే అజెండాను కలిగి ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటన తర్వాత తనకు పాకిస్తాన్ నుండి బెదిరింపులు కూడా వచ్చాయని, అయితే తాను ఆ మహిళ కోసం నిలబడ్డానని చెప్పారు. నిజమైన పరిస్థితుల్లో మహిళలకు 100% మద్దతు ఇస్తానని ఆయన స్పష్టం చేశారు.

View this post on Instagram

A post shared by Arjun Sarja (@arjunsarjaa)

ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..