Jabardasth Nookaraju : కన్నీళ్లు పెట్టించిన నూకరాజు.. పెట్రోల్ పోసుకొని ఎట్లా కాల్చుకున్నావ్ అంటూ..
హైపర్ ఆదిలాంటి వారు సినిమాల్లో కమెడియన్స్ గా మంచి అవకాశాలు అందుకున్నారు. అలాగే సుడిగాలి సుధీర్ హీరోగా సినిమాలో చేస్తున్నాడు. ఇటీవలే గెటప్ శ్రీను కూడా హీరో అయ్యాడు. ఇటీవలే రాజు యాదవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అలాగే దర్శకులుగా కూడా మారారు. వేణు బలగం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అలాగే ధనరాజ్ కూడా దర్శకుడిగా మారాడు.

జబర్దస్త్ వల్ల చాలా మందికి మంచి క్రేజ్ వచ్చింది. కమెడియన్స్ గా చాలా మంది మంచి పొజిషన్ లో ఉన్నారు. జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను నవ్వించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అలాగే చాలా మంది సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నారు. హైపర్ ఆదిలాంటి వారు సినిమాల్లో కమెడియన్స్ గా మంచి అవకాశాలు అందుకున్నారు. అలాగే సుడిగాలి సుధీర్ హీరోగా సినిమాలో చేస్తున్నాడు. ఇటీవలే గెటప్ శ్రీను కూడా హీరో అయ్యాడు. ఇటీవలే రాజు యాదవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అలాగే దర్శకులుగా కూడా మారారు. వేణు బలగం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అలాగే ధనరాజ్ కూడా దర్శకుడిగా మారాడు. అలాగే జబర్దస్త్ లో ఉన్న కమెడియన్స్ లో ప్రేక్షకులకు దగ్గర అయిన వారిలో నూకరాజు ఒకరు.
నూక రాజు పేరు ఈ మధ్యకాలంలో బాగానే వినిపిస్తుంది. కేవలం కమెడియన్ గానే కాదు తనలో ఉన్న టాలెంట్ ను బయటపెడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. మొన్నామధ్య కాంతారా’ సినిమాలోని సాంగ్ కు డాన్స్ చేశాడు నూకరాజు. జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లోనూ కూడా పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి షోకు సంబందించిన ఓ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో నూకరాజు ఎమోషనల్ అయ్యాడు.
ఈ ప్రోమోలో నూకరాజు ప్రేక్షకులను తన కామెడీతో అలరించాడు. నూకరాజు ఫైమా పై పేరడీ సాంగ్ పాడి అలరించాడు. ఈ షోకు హీరో సుధీర్ బాబు గెస్ట్ గా హాజరయ్యారు. ఇక ఈ ప్రోమోలో చివరిగా నూకరాజు అద్భుతంగా పాట పాడి ప్రేక్షకులను అలరించాడు. తెలంగాణ కోసం పోరాడి.. అమరులైన వారిపై ఓ సాంగ్ పాడాడు. అద్భుతంగా పాడి అందరిని కన్నీళ్లు పెట్టుకునేలా చేశాడు నూకరాజు. తెలంగాణ కోసం పోరాడి అమరుడైన శ్రీకాంత చారీ పై పాట పాడాడు నూకరాజు. దాంతో ఆ షోలో ఉన్నవారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నూకరాజు పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
