AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Faima: రూ.500 అప్పు చేశా.. రూమ్‌లోకి వెళ్లి డోర్ పెట్టుకొని చనిపోతానని ఏడ్చా.. ఫైమా కామెంట్స్

ఈ కామెడీ షో ద్వారా పరిచయమైన సుడిగాలి సుధీర్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అలాగే హైపర్ ఆది కమెడియన్ గా అవకాశాలు అందుకుంటున్నారు. అలాగే  వేణు, ధనరాజ్ దర్శకులుగా మారి సినిమాలు తీస్తున్నారు. వీరితోపాటు ఇంకొంతమంది కూడా సినిమాలో నటిస్తున్నారు. అలాగే కొంతమంది బిగ్ బాస్ షోకు కూడావెళ్తున్నారు. ఇక ఈ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో ఫైమా ఒకరు. తన కామెడీ టైమింగ్ తో పంచ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఫైమా.

Jabardasth Faima: రూ.500 అప్పు చేశా.. రూమ్‌లోకి వెళ్లి డోర్ పెట్టుకొని చనిపోతానని ఏడ్చా.. ఫైమా కామెంట్స్
Faima
Rajeev Rayala
|

Updated on: Jul 31, 2024 | 3:57 PM

Share

ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ షో వల్ల చాలా మంది ఫేమస్ అయ్యారు. ఈ కామెడీ షోకు మని ప్రేక్షాదరణ లభించింది. ఎంతో మంది ఈ షో వల్ల గుర్తింపు పొందారు.. అలాగే సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నారు. ఈ కామెడీ షో ద్వారా పరిచయమైన సుడిగాలి సుధీర్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అలాగే హైపర్ ఆది కమెడియన్ గా అవకాశాలు అందుకుంటున్నారు. అలాగే  వేణు, ధనరాజ్ దర్శకులుగా మారి సినిమాలు తీస్తున్నారు. వీరితోపాటు ఇంకొంతమంది కూడా సినిమాలో నటిస్తున్నారు. అలాగే కొంతమంది బిగ్ బాస్ షోకు కూడావెళ్తున్నారు. ఇక ఈ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో ఫైమా ఒకరు. తన కామెడీ టైమింగ్ తో పంచ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఫైమా. ఆమె స్కిట్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవి.

జబర్దస్త్ వల్ల వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగుపెట్టింది. బిగ్ బాస్ హౌస్‌లో తన ఆటతో ప్రేక్షకులను మెప్పించింది. నిజాయితీగా టాస్క్‌కు ఆడి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక త్వరలోనే ఫైమా పెళ్లిపీటలు ఎక్కనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫైమా ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు పటాస్ షోలో అవకాశం వచ్చినప్పుడు తన ఫ్యామిలీ ఏమన్నారో తెలిపింది.

ఫైమా మాట్లాడుతూ.. పటాస్ షోలోకి వెళ్లెవరకూ మా ఇంట్లో టీవీ లేదు.. ఒకసారి మా కాలేజ్ స్టూడెంట్స్ ను పటాస్ షోకు తీసుకెళ్లారు.. ఆడియన్స్ గా తీసుకువెళ్ళడానికి ఒకొక్కరి దగ్గర రూ.500 వసూల్ చేశారు. అయితే నా దగ్గర ఆసమయంలో డబ్బులు లేకపోవడంతో మా ఫ్రెండ్ దగ్గర రూ. 500 అప్పు చేసి వెళ్ళాను. ఆతర్వాత నా జోక్స్ ను ప్రోమో కట్ చేసి వదిలారు.. ప్రోమోకు విపరీతమైన  రెస్పాన్స్ వచ్చింది. దాంతో నేను ఆ షోకి వెళ్తాను మా అమ్మను అడిగాను.. కానీ హైదరాబాద్ వెళ్లాలి వొద్దు అని అన్నారు. మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని నేను రెండు రోజులు అన్నం తినలేదు. మా నాన్నను నేను చాలా ఇష్టం.. నేను ఏడిస్తే తట్టుకోలేడు. ఆయన వేరే దేశంలో ఉండేవాడు. ఆయనకు కూడా ఒప్పుకోలేదు. దాంతో నేను ఓ రూమ్ లోకి వెళ్లి డోర్ పెట్టుకొని చచ్చిపోతాను అని బెదిరించా అప్పుడు ఒప్పుకుంది అని తెలిపింది ఫైమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి