AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమాతో మంచి గుర్తింపు వస్తుందనుకున్నా.. కానీ రాలేదు..! తాగుబోతు రమేష్ ఎమోషనల్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమలో తన విలక్షణమైన శైలితో, ముఖ్యంగా తాగుబోతు పాత్రలతో ప్రేక్షకుల మన్నన పొందిన నటుడు తాగుబోతు రమేష్. ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ షోలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు తాగుబోతు రమేష్. అలాగే జబర్దస్త్ కామెడీ షోలోనూ తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.

ఆ సినిమాతో మంచి గుర్తింపు వస్తుందనుకున్నా.. కానీ రాలేదు..! తాగుబోతు రమేష్ ఎమోషనల్ కామెంట్స్
Thagubothu Ramesh
Rajeev Rayala
|

Updated on: Jul 07, 2026 | 12:30 PM

Share

తెలుగు సినిమా తెరపై తనదైన శైలి కామెడీ పండిస్తూ ప్రేక్షకులను అలరించిన తాగుబోతు రమేష్, తన నటన ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులను, తాగుబోతు అనే ఇమేజ్‌తో వచ్చిన సవాళ్లను, దర్శకుడు సుకుమార్ ప్రభావం, చివరకు అందుకున్న నంది అవార్డు గుర్తింపు గురించి ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 2006లో సుకుమార్ దర్శకత్వం వహించిన జగడం చిత్రంతో రమేష్ సినీరంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రం కోసం గోదావరిఖనిలో తన అన్నలు బ్యానర్లు కట్టించి తన తొలి సినిమాను అద్భుతమైన అనుభవంగా మార్చారని రమేష్ గుర్తు చేసుకున్నారు. మహాత్మా, అలా మొదలైంది, 100% లవ్, పిల్లా జమిందార్, ఇష్క్ వంటి అనేక విజయవంతమైన చిత్రాలతో రమేష్ అనతికాలంలోనే గుర్తింపు పొందారు. ముఖ్యంగా అలా మొదలైంది తన కెరీర్‌కు ఒక మలుపు అని, అది తన జీవితాన్ని మార్చిందని రమేష్ అన్నారు. అయితే, హాస్యనటుడిగా పీక్స్ చేరుకున్న తర్వాత, కేవలం తాగుబోతు పాత్రలకే పరిమితం కావడంతో రమేష్‌లో ఒక రకమైన అసంతృప్తి మొదలైందట. “నువ్వేంటి రా తమ్ముడు, ఒక సీన్‌కు పరిమితమయ్యావు, కరెక్ట్‌గా వాడట్లేదా? తాగుబోతు పాత్రలు బోర్ కొట్టాయి, కొంచెం మార్చు” అని ఫోన్లు కూడా వచ్చేవని ఆయన చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి : OTT Movie : పెద్దికి పోటీగా ఓటీటీలోకి క్రేజీ మూవీ.. రిలీజ్ అయిన 5 వారాల్లోనే స్ట్రీమింగ్ రెడీ..

ఇలాంటి సమయంలో, దర్శకుడు సుకుమార్ నాన్నకు ప్రేమతో చిత్రంలో ఒక విభిన్నమైన, స్టైలిష్ పాత్రను ఆఫర్ చేశారు. “రమేష్, నిన్ను లండన్ తీసుకెళ్తా, నీకు కంఫర్టబుల్ ఏనా.? రెండు మూడు నెలలు ఉండాలి” అని సుకుమార్ అడిగినప్పుడు, రమేష్ ఏ మాత్రం ఆలోచించకుండా అంగీకరించారు. “సార్ తీసుకెళ్తానంటే ఇక్కడ సినిమాలు ఆపుకొని, ముందు ఆ సినిమా చేస్తా. అంతకంటే ఇంకేం ఉంటుంది?” అంటూ లండన్ వెళ్ళిపోయారట. అప్పటికే ఎన్టీఆర్ తో బాద్‌షా వంటి చిత్రాల్లో మంచి పాత్రలు చేసినప్పటికీ, నాన్నకు ప్రేమతోలో ఇంగ్లీష్ డైలాగ్స్‌తో కూడిన ఒక స్టైలిష్ క్యారెక్టర్ చేయడం తన కెరీర్‌లో కొత్తదని రమేష్ తెలిపారు.

ఇది కూడా చదవండి : అతను ఓ సైకో.. నన్ను సిగరెట్‌తో కాల్చాడు, పిచ్చి పిచ్చిగా కొట్టాడు.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్

అయితే, చిత్రం విడుదలైన తర్వాత తన పాత్రకు అనుకున్నంత ప్రాధాన్యత లభించకపోవడం ఆయనను నిరాశపరిచిందట. ఆ పాత్రలో వేషం దొరకడమే అదృష్టం అనుకోవాలి, సుకుమార్ లాంటి గొప్ప దర్శకుడు ఇచ్చిన అవకాశం అంతకు మించి ఉంటుందని ఆశించినట్లు తెలిపారు. ఈ కారణం చేతనే, తన పనికి తగిన గుర్తింపు లభించనప్పుడు తాను ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇష్టపడలేదని రమేష్ స్పష్టం చేశారు. తన జీవితంలో ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన సలహాలను ఆయన గుర్తు చేసుకున్నారు. మహాత్మా సినిమాలో తనతో కలిసి పనిచేసిన మధు అనే మిత్రుడు “మన వర్క్ మాట్లాడాలి, మనం మాట్లాడకూడదు” అని అన్నారని తెలిపారు. అలాగే, జగడం సమయంలో చారి గారు “సినిమా ఆర్టిస్టుల అవసరం ఉంటే అండమాన్ నుంచి తీసుకొస్తారు. అవసరం లేదంటే అన్నపూర్ణ గేటు ముందు నిల్చుంటే, కార్ గ్లాసులు ఎక్కించుకొని వెళ్తారు” అని చెప్పిన మాటలు తనకెంతో గుణపాఠం నేర్పాయని రమేష్ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : పెళ్లి రోజున సర్‌ప్రైజ్ అని విడాకులు ఇచ్చాడు.. కన్నీళ్లు పెట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్..!
ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్..!
ఒంటి చేత్తో గాల్లో ఆ క్యాచ్ ఏంటి భయ్యా.. వీడియో చూస్తే అవాక్కే..!
ఒంటి చేత్తో గాల్లో ఆ క్యాచ్ ఏంటి భయ్యా.. వీడియో చూస్తే అవాక్కే..!
మాటలు కోటలు దాటుతాయి.. చేతలు మాత్రం గడప దాటవ్.. కోతి ఉపవాసం కథ
మాటలు కోటలు దాటుతాయి.. చేతలు మాత్రం గడప దాటవ్.. కోతి ఉపవాసం కథ
ప్రైవేట్ వీడియో లీక్.. 4 రోజులు ఇంట్లోనే ఉండిపోయా.. హీరోయిన్..
ప్రైవేట్ వీడియో లీక్.. 4 రోజులు ఇంట్లోనే ఉండిపోయా.. హీరోయిన్..
ఎస్బీఐ కొత్త విత్ డ్రా రూల్స్.. నెలకు నాలుగు మాత్రమే..
ఎస్బీఐ కొత్త విత్ డ్రా రూల్స్.. నెలకు నాలుగు మాత్రమే..
అతను ఆల్‌రౌండర్ ఏంటి గంభీర్.. సిరాజ్‌ను పక్కనెట్టి మరీ ఛాన్స్..!
అతను ఆల్‌రౌండర్ ఏంటి గంభీర్.. సిరాజ్‌ను పక్కనెట్టి మరీ ఛాన్స్..!
స్పెషల్‌ టెట్‌లో 70.07% ఉత్తీర్ణత.. నవంబర్‌లో మరోసారి TET నిర్వహణ
స్పెషల్‌ టెట్‌లో 70.07% ఉత్తీర్ణత.. నవంబర్‌లో మరోసారి TET నిర్వహణ
నాని 'ది ప్యారడైజ్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
నాని 'ది ప్యారడైజ్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
వేల రూపాయలు పెట్టి వాడినా.. భరించలేని చర్మ దురదలకు స్పీడ్ తో చెక్
వేల రూపాయలు పెట్టి వాడినా.. భరించలేని చర్మ దురదలకు స్పీడ్ తో చెక్
AI కెమెరా చేసిన పనికి రూ. 500 ట్రాఫిక్ చలాన్..!
AI కెమెరా చేసిన పనికి రూ. 500 ట్రాఫిక్ చలాన్..!