
ప్రముఖ టీవీ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ కామెడీ ప్రోగ్రాం.. ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది నటీ నటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొంతమంది హీరోలుగా, మరికొంతమంది దర్శకులుగా, కమెడియన్స్ గా సెటిల్ అయ్యారు. ఎంతో మంది ట్యాలెంటెడ్ కమెడియన్స్‌ను వెలుగులోకి తీసుకొచ్చిన షో జబర్దస్త్. అలాంటి ఈ షో నుంచి షైన్ అయ్యాడు నరేష్. తనకున్న వైకల్యాన్నే.. తనకు ప్లస్‌గా మార్చుని బుల్లి తెరపై రాణిస్తున్నాడు. జబర్దస్త్ ఒక్కటే కాదు.. మల్లెమాల ప్రొడక్షన్స్‌లో చాలా షోలే చేస్తున్నాడు.
రెండు చేతులా సంపాదిస్తున్నాడు. తన కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు నరేష్. ఈ చిన్నోడు గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సీరియల్ నటి షబీనా షేక్ తో.. జబర్దస్త్‌లో లవ్ ట్రాక్ నడిపాడు నరేష్. స్టేజ్ పై ఆమెను పడేయడానికి నానా ప్రయత్నాలు చేసి ప్రేక్షకులకు నవ్వించేవాడు. ఆమె చుట్టే తిరిగేవాడు. తోటి కంటెస్టెంట్స్ కూడా వీరిద్దనీ లవర్స్ గానే కామెంట్స్ చేసేవారు. వాళ్ల స్కిట్స్‌లో వీరిద్దరి ఎఫైర్ పై పంచ్ లు వేసేవారు. దీంతో ఈ ఇద్దరూ నిజంగా లవ్ లో ఉన్నారని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలేనే నబీనా రీసెంట్ గా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో నబీనా నరేష్‌కు హ్యాండిచ్చింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి.
కట్ చేస్తే.. దీనిపై నరేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనది రియల్ లవ్ కాదని.. స్కిట్ లవ్ అంటూ రివీల్ చేశాడు.తమ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేసింది రోజా అని షాకింగ్ విషయం చెప్పాడు. అది కేవలం స్టేజ్ వరకే అన్నాడు. ఇక షబీనా తనను పెళ్ళికి పిలిచిందని.. కానీ పెళ్లి గుంటూరులో కావడంతో తాను వెళ్ళలేకపోయానంటూ చెప్పాడు. పెళ్ళికి వెళ్తే తనను చూసి పీటల మీద నుంచి వచ్చేసేదేమో.. అంటూ సరదాగా అన్నాడు నరేష్. అంతేకాదు తన పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు ఈ జబర్దస్త్ నరేష్. ఇంకో రెండేళ్లలో తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. తనకు అందంగా.. మోడ్రన్ గా ఉన్న అమ్మాయిలే కావాలనే రూల్ లేదని.. తన తల్లిదండ్రులను మంచిగా చూసుకునే అమ్మాయి అయితే చాలన్నాడు. అలాగే ఇండస్ట్రీ అమ్మాయి అయినా.. బయట అమ్మాయి అయినా తనకు పర్లేదని చెప్పుకొచ్చాడు ఈ చోటా కమెడియన్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.