ఉత్త పోస్టర్ మాత్రమే అనుకునేరు.. ఆ పోస్టర్‌తోనే కథపై హింట్ ఇచ్చిన డైరెక్టర్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్, సినీప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. మరోవైపు డార్లింగ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి వచ్చే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్స్ నుంచి పోస్టర్స్ విడుదలయ్యాయి,. ముఖ్యంగా హను, ప్రభాస్ కాంబో పై క్లారిటీ వచ్చేసింది.
సితారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి .. ఇప్పుడు ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాగా.. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా ఈ మూవీ టైటిల్ గురించి ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. తాజాగా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ముందు నుంచి వినిపిస్తున్నట్లుగానే ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు డైరెక్టర్ హను. పోస్టర్ కూడా అదిరిపోయేలా.. ఫ్యాన్స్ కు నచ్చేలానే ఉంది. అంతేకాదు ఆ పోస్టర్ పై ఉన్న డీటేలింగ్ కూడా ఇప్పుడు ఫ్యాన్స్ లో క్యూరియాసిటీని పెంచేస్తోంది. “పద్మవ్యూహాన్ని జయించిన పార్థుడు.. పాండవ పక్షంలో నిలిచిన కర్ణుడు.. గురువు లేకుండానే యుద్ధ కళలో నిపుణుడైన ఏకలవ్యుడు, జన్మతః యోధుడు ఇతనే “ అంటూ ఎలివేషన్ ఇస్తూనే మన చరిత్రలోని దాగిన అధ్యాయాల నుంచి ఒక యోధుడి అత్యంత ధైర్యవంతమైన కథ అన్న క్యాప్షన్ తో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు డైరెక్టర్ హను.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘నేను విడాకులు తీసుకుంటే వాళ్లు సంబరాలు చేసుకున్నారు’
‘అరడజను’ పిల్లలతో సంతోషంగా ఉండు బావా !! డార్లింగ్‌కు మోహన్‌బాబు బర్త్‌డే విష్
2025 లో నాగుల చవితి ఎప్పుడు.. వివరాల కోసం ఈ వీడియో చూసేయండి
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

