టాక్సిక్ విషయంలో తప్పెక్కడజరుగుతోంది ??
టాక్సిక్ విషయంలో అసలేం జరుగుతుంది..? ఏం జరుగుతుంది.. హాయిగా షూటింగ్ జరుగుతుంది కదా అనుకోవచ్చు. అలా జరిగితే ఇలా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే రాదు కదా. యశ్ సినిమా విషయంలో ఏదో అయితే గట్టిగానే జరుగుతుంది. అదేంటా అని కంగారు పడుతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ అనుకున్న టైమ్‌కు టాక్సిక్ విడుదలవుతుందా..? ఒక్కోసారి రావాల్సిన దానికంటే ఎక్కువ ఇమేజ్, మార్కెట్ వచ్చినా కూడా ఇబ్బందే.
దాన్నెలా హ్యాండిల్ చేయాలా అనే కంగారులోనే ఏళ్లకేళ్లు గడిచిపోతుంటాయి. కావాలంటే యశ్‌నే తీసుకోండి.. కేజియఫ్ ఛాప్టర్ 2 విడుదలై రెండున్నరేళ్లు అయిపోయినా.. ఇప్పటి వరకు మరో సినిమా రిలీజ్ చేయలేదు రాకింగ్ స్టార్. ప్లానింగ్‌తోనే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. యశ్ ప్రస్తుతం టాక్సిక్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అంతా బాగానే ఉన్నా.. టాక్సిక్ విషయంలో మాత్రం ఏదీ సవ్యంగా జరగట్లేదని కంగారు పడుతున్నారు అభిమానులు. ముఖ్యంగా రీ షూట్స్ ఎక్కువగా జరుగుతున్నాయనే ప్రచారం ఎక్కువైంది. ఔట్ పుట్ విషయంలో అసంతృప్తిగా ఉన్న యశ్.. చాలా వరకు సీన్స్ అన్నీ రీ షూట్ చేయాలని దర్శకురాలికి సూచించారనే వార్తలు వినిపిస్తున్నాయి. కేజియఫ్ తర్వాత సినిమా కావడంతో.. రిస్క్ తీసుకోడానికి యశ్ అస్సలు ఇష్టపడట్లేదని.. ఎంత లేటైనా పర్లేదు కానీ పర్ఫెక్ట్ ఔట్ కమ్ కావాలంటున్నారని తెలుస్తుంది. అయితే ఈ ఆలస్యం కారణంగా బడ్జెట్ తడిసి మోపెడవుతుంది. టాక్సిక్ నుంచి ఇప్పటి వరకు వచ్చింది ఒక్క టీజర్ మాత్రమే.. అందులోనూ ఏం లేదు. మరోవైపు 2026, మార్చి 19న డేట్ అనౌన్స్ చేసారు. అనుకున్న టైమ్‌కు టాక్సిక్ వస్తుందా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఈ సినిమాతో పాటు నితీష్ తివారి రామాయణలోనూ నటిస్తున్నారు యశ్. అందులో రావణుడిగా నటిస్తుండటమే కాక.. నిర్మాతగానూ ఉన్నారీయన.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉత్త పోస్టర్ మాత్రమే అనుకునేరు.. ఆ పోస్టర్‌తోనే కథపై హింట్ ఇచ్చిన డైరెక్టర్
‘నేను విడాకులు తీసుకుంటే వాళ్లు సంబరాలు చేసుకున్నారు’
‘అరడజను’ పిల్లలతో సంతోషంగా ఉండు బావా !! డార్లింగ్‌కు మోహన్‌బాబు బర్త్‌డే విష్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

