అహ్మదాబాద్ సీన్ రిపీట్.. టేకాఫ్ కాగానే.. కూలిన విమానం
వెనెజులాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఓ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పారామిల్లో విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన PA-31 అనే ప్రైవేటు విమానం.. కొద్ది సేపట్లోనే ప్రమాదానికి గురైంది. విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో..ఆ విమానం వేగంగా దూసుకొచ్చి నేలపై కుప్పకూలింది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రన్‌వేపై భారీ శబ్ధం రావడంతో అలర్టైన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, ఫైర్ డిపార్ట్‌మెంట్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు విమాన సిబ్బంది మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలంలో మరణించిన వారిని టోనీ బోర్టన్, జువాన్ మాల్డోనాడోగా గుర్తించారు. గాయాల పాలైన ఇద్దరిని ఆసుపత్రిలో చేరారు. అగ్నిమాపక దళం, సివిల్ ప్రొటెక్షన్ టీం, బొలివేరియన్ నేషనల్ పోలీస్ వెంటనే స్పందించి సహాయ, సహాయ చర్యలను చేపట్టారు. ప్రభుత్వ లాజిస్టిక్స్ కార్యకలాపాల్లో ఈ విమానాన్ని వాడుతున్నట్లు తెలుస్తోంది. పైపర్ చెయెన్ మొడల్ విమానాన్ని అమెరికన్ కంపెనీ అయిన పైపర్ ఎయిర్‌క్రాఫ్ట్ 1970లో తయారు చేసింది. అయితే ఈ ట్విన్-ఇంజన్ విమానం పనితీరు, భద్రత బాగుంటాయని పేరు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పుగా పెట్రోల్ పోయలేదని.. పొట్టు పొట్టు కొట్టిన ఖాకీ
నవంబరు 1 నుంచి బ్యాంక్‌ల కొత్త రూల్స్ ఇవే
వారికి బంపరాఫర్.. గ్రాము బంగారంపై రూ.9,700 లాభం
రెండోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. ఉపాసన సీమంతం వేడుక
చంద్రుడిపై నిర్మాణాలు అసాధ్యమా ?? కీలక సమాచారం పంపిన చంద్రయాన్-2
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

