AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారికి బంపరాఫర్‌.. గ్రాము బంగారంపై రూ.9,700 లాభం

వారికి బంపరాఫర్‌.. గ్రాము బంగారంపై రూ.9,700 లాభం

Phani CH
|

Updated on: Oct 24, 2025 | 6:40 PM

Share

కొన్నాళ్లుగా బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగిపోతుంది. అయితే ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది. దీపావళి వేళ బంగారం కొనుగోలు చేసేవారికి కాస్త ఊరటనిచ్చింది. దీంతో ఒక్కరోజే వందల కోట్లలో వ్యాపారం జరిగింది. ఈ పసిడి ధరలు పెరగడం, తగ్గడం సహజం. పెరుగుదల పెట్టుబడిదారులకు లాభాలను తెచ్చిపెడితే.. ఎప్పుడు బంగారం రేటు తగ్గుతుందా.. కొనుక్కుందామని ఎదురుచూసిన వారికి కాస్త ఆనందాన్నిచ్చింది.

అయితే ఎనిమిదేళ్ళ క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టినవారికి మాత్రం భారీ లాభాలు తెచ్చిపెట్టింది బంగారం. అవును, గోల్డ్‌ బాండ్లలో పెట్టుబడులు పెట్టినవారు బంపర్‌ ఆఫర్‌ అందుకుంటున్నారు. 8 ఏళ్ల క్రితం నాటి సార్వభౌమ పసిడి బాండ్లకు చెందిన రిడెంప్షన్‌ తేదీని ఆర్‌బీఐ తాజాగా ప్రకటించింది. అప్పట్లో ఈ బాండ్లు కొన్నవారికి ఏకంగా 325.3 శాతం లాభం రావడం విశేషం. 2017-18 సిరీస్‌-IV గోల్డ్‌ బాండ్ల సిరీస్‌కు సంబంధించి ఫైనల్‌ రిడెంప్షన్‌ తేదీని అక్టోబరు 23, 2025గా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. 999 స్వచ్ఛత కలిగిన గ్రాము బంగారం ధరను రూ.12,704గా నిర్ణయించింది. ఈ సిరీస్‌ బాండ్లను 2017 అక్టోబరు 23న ఆర్‌బీఐ జారీ చేసింది. అప్పట్లో గ్రాము బంగారం ధరను రూ.2,987గా నిర్ణయించారు. ఈ బాండ్ల కాలపరిమితి 8 ఏళ్లు కావడంతో తాజాగా మెచ్యూరిటీకి వచ్చాయి. ప్రస్తుతం గ్రాము బంగారం ధరను రూ.12,704గా పేర్కొంది. దీంతో కొనుగోలు ధరను మినహాయిస్తే మదుపర్లకు ఒక్కో గ్రాముపై రూ.9,717 లాభం వచ్చింది. ప్రతి గ్రాముపై 325.3శాతం ప్రతిఫలం వచ్చింది. దీనికి ఏటా చెల్లించే 2.5 శాతం వడ్డీ అదనం. అంటే ఈ మొత్తం ఇంకా ఎక్కువనే చెప్పాలి. దేశంలో భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ఉద్దేశంతో 2015 నవంబర్‌లో ఆర్‌బీఐ ఈ పథకం తీసుకొచ్చింది. వీటి కాలపరిమితి 8 ఏళ్లు. గ్రాము ధర నిర్ణయించేందుకు రిడెంప్షన్‌కు ముందు వారం చివరి మూడు రోజుల ఇండియా బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ నిర్ణయించిన సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటారు. అలా గ్రాము ధరను రూ.12,567గా నిర్ణయించారు. అక్టోబర్‌ 13, 14, 15 తేదీల సగటును ఆధారంగా చేసుకున్నారు. ఇటీవల బంగారం ధరలు చుక్కలు తాకుతున్న వేళ బాండ్లు రిడెంప్షన్‌కు రావడంతో మదుపర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. మరో విశేషమేంటేంటే… ఈ వచ్చిన మొత్తానికి ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించక్కర్లేదట. 2015-16 బడ్జెట్‌లో తీసుకొచ్చిన ఈ పథకం కింద కేంద్రం తరఫున ఆర్‌బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. అయితే, చివరిసారిగా 2024 ఫిబ్రవరిలో సబ్‌స్క్రిప్షన్‌కు అనుమతిచ్చారు. ఆ తర్వాత ఈ బాండ్లను జారీ చేయలేదు. ఖజానాకు భారం కావడంతో ఈ బాండ్ల జారీని ప్రభుత్వం నిలిపివేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెండోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. ఉపాసన సీమంతం వేడుక

చంద్రుడిపై నిర్మాణాలు అసాధ్యమా ?? కీలక సమాచారం పంపిన చంద్రయాన్‌-2

Diwali Sales 2025: దీపావళి సేల్స్‌ ఎన్ని లక్షల కోట్లు దాటాయంటే.. జనం ఎక్కువగా మోజు పడ్డవి ఇవే

పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. ఏమైందంటే

China: గంటకు 453 కి.మీ హై స్పీడ్‌ రైలును ఆవిష్కరించిన చైనా