2025 లో నాగుల చవితి ఎప్పుడు.. వివరాల కోసం ఈ వీడియో చూసేయండి
హిందూ సంప్రదాయంలో పాములకు విశేష ప్రాధ్యాన్యత ఉంది. పాములను పూజించడం హిందూ ఆచారంలో భాగం. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే చవితి రోజున కార్తీక మాసం లో నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది నాగుల చవితి అక్టోబర్ 25న వచ్చింది. ఆ రోజు తెలుగు వారు అత్యంత ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు.
ప్రకృతి, జంతువుల పట్ల గౌరవ సూచకంగా ఈ వేడుకను చేసుకుంటారు. ఈ నాగుల చవితి పండుగ రోజున భక్తులు పుట్టలో ఆవు పాలతో పాటు గుడ్లు వేస్తారు. చలిమిడి, చిమ్మిరి నైవేద్యంగా నాగదేవతకు సమర్పిస్తారు. అలాగే జంట నాగుల విగ్రహాలకు పాలు, పసుపు, కుంకుమతో అభిషేకం చేస్తారు. అంతే కాకుండా పుట్ట దగ్గర టపాసులు కూడా కాలుస్తారు. మహిళలు సౌభాగ్యం కోసం, సంతానప్రాప్తి కోసం సర్పపూజ చేస్తారు. నాగుల చవితి రోజు నాగదేవతను పూజించడం వల్ల రాహువు గ్రహం యొక్క దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చు. అలాగే కుజ దోషం, కాల సర్ప దోషాలు తొలగిపోతాయని నమ్మకం. పురాణాల ప్రకారం నాగుల చవితి పండుగ గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దాదాపు ప్రతి దేవాలయంలో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే నాగుల చవితి రోజున నాగేంద్రుడు పరమేశ్వరుడికి వాసుకిగా, శ్రీమహావిష్ణువుకి ఆదిశేషుగా మారి తోడుగా ఉంటాడట. అందుకే ఈ పవిత్రమైన నాగుల చవితి రోజున భక్తులందరూ నాగ దేవతను పూజిస్తే సర్వరోగాలు తొలగిపోతాయని నమ్మకం. నాగదోషం, రాహు కేతు దోషాలు ఉన్న వారు కూడా నాగుల చవితి రోజున నాగేంద్రుడిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అహ్మదాబాద్ సీన్ రిపీట్.. టేకాఫ్ కాగానే.. కూలిన విమానం
అప్పుగా పెట్రోల్ పోయలేదని.. పొట్టు పొట్టు కొట్టిన ఖాకీ
నవంబరు 1 నుంచి బ్యాంక్‌ల కొత్త రూల్స్ ఇవే
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

