Dulquer Salmaan: డైరెక్షన్ చేయడంపై మనసులో మాట చెప్పేసిన దుల్కర్.. ఫ్యాన్స్‌కు పండగే

ఈ క్యూట్‌ హీరో... దర్శకత్వం వైపు కూడా చూస్తున్నారు. చుప్ ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దుల్కర్ ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు.

Dulquer Salmaan: డైరెక్షన్ చేయడంపై మనసులో మాట చెప్పేసిన దుల్కర్.. ఫ్యాన్స్‌కు పండగే
Dulquer Salmaan
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 01, 2022 | 11:42 AM

ఈ జనరేషన్‌ హీరోలు జస్ట్ హీరోలుగా ఉండిపోవాలి అనుకోవటం లేదు. అందుకే యాక్టింగ్‌తో పాటు ఇతర రంగాల్లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎక్కువ మంది హీరోలు నిర్మాతలు మారుతుంటే, ఒకరిద్దరు మాత్రం మెగాఫోన్‌తో సత్తా చాటే పనిలో ఉన్నారు. తాజాగా ఛార్మింగ్ స్టార్‌ దుల్కర్ కూడా ఈ లిస్ట్‌లో చేరేందుకు రెడీ అన్న సిగ్నల్ ఇచ్చారు. మల్టీ లింగ్యువల్‌ స్టార్‌గా దూసుకుపోతున్న మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌. మాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన దుల్కర్‌… తరువాత తెలుగు, హిందీ భాషల్లోనూ హీరోగా మంచి విజయాలు సాధించారు. రీసెంట్‌గా సీతారామమ్ సినిమాతో పాన్‌ ఇండియా హిట్ సాధించి… నేషనల్‌ లెవల్‌లో ఫుల్ బిజీ అయ్యారు.

ప్రజెంట్ హీరోగా బిజీగా ఉన్న దుల్కర్‌… నిర్మాతగానూ తన మార్క్‌ చూపిస్తున్నారు. రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఇంట్రస్టింగ్ ఐడియాస్‌తో రూపొందుతున్న సినిమాలను మాత్రమే తన బ్యానర్‌లో ప్రొడ్యూసర్ చేస్తున్నారు దుల్కర్‌. ఆల్రెడీ యాక్టింగ్‌, ప్రొడక్షన్‌తో ఫుల్ బిజీగా ఉన్న ఈ క్యూట్‌ హీరో… దర్శకత్వం వైపు కూడా చూస్తున్నారు. చుప్ ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దుల్కర్ ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ఈ సినిమాలో దర్శకుడిగా కనిపించిన ఈ యంగ్ హీరో.. ఫ్యూచర్‌లో రియల్‌గానూ మెగాఫోన్ పట్టుకునే ఛాన్స్ ఉందని చెప్పారు.

ప్రస్థుతానికి నటుడిగా ఫుల్ బిజీగా ఉన్నానన్న దుల్కర్ సల్మాన్‌… యాక్టింగ్‌ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకున్నప్పుడు డైరెక్షన్ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. దర్శకత్వం అనేది చాలా పెద్ద పని అన్న దుల్కర్‌.. నటుడిగా కొనసాగుతూ డైరెక్షన్‌ చేయటం తన వల్ల కాదని క్లారిటీ ఇచ్చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..