AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐటీ అధికారుల దూకుడు.. దిల్ రాజుతో సహా మైత్రి మేకర్స్ పై కూడా దాడులు

హైదరాబాద్ లో ఐటీ అధికారులు దూకుడు చూపిస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు ఇళ్ల పై ఆఫీసుల పై దాడులు చేశారు అధికారులు. అలాగే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ ఇళ్ల పై ఆఫీసుల పై కూడా దాడులు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆఫీసులు, ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

ఐటీ అధికారుల దూకుడు.. దిల్ రాజుతో సహా మైత్రి మేకర్స్ పై కూడా దాడులు
Dil Raju, Mythri Makers
Rajeev Rayala
|

Updated on: Jan 21, 2025 | 9:58 AM

Share

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆఫీసులు, ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దిల్‌రాజు ఇళ్లు, ఆఫీసులతో పాటు శిరీష్, దిల్ రాజు కూతురు ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి.  జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. అలాగే దిల్‌రాజు వ్యాపార భాగస్వాముల ఇళ్లల్లోనూ ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో అనేకచోట్ల సోదాలు చేస్తున్న 65 బృందాలు, ఎనిమిది ప్లేసుల్లో సోదాలు చేస్తున్నారు. సంక్రాంతికి దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ నుంచి రెండు భారీ సినిమాలు విడుదలయ్యాయి. గేమ్‌ ఛేంజర్‌, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను భారీ బడ్జెట్‌తో నిర్మించారు దిల్‌రాజు. అలాగే బాలకృష్ణ డాకు మహారాజ్‌ సినిమాకి డిస్ట్రిబ్యూటర్‌గా దిల్‌రాజు వ్యవహరించారు.

మరో వైపు మైత్రీ సంస్థ మీద కూడా ఐటి దాడులు జరుగుతున్నాయి. మైత్రీ నవీన్, సిఇఒ చెర్రీ, ఇంకా సంస్థ సంబంధీకుల అందరి ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. మైత్రీ సంస్థ ఇటీవలే పుష్ప 2తో భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఏకంగా రూ. 18వందల కోట్లకు పైగా వసూల్ చేసినట్టు మేకర్స్ పోస్టర్స్ ద్వారా తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో సంక్రాంతి సమయంలో పుష్ప 2 రీ లోడెడ్ పేరుతో మరికొంత భాగాన్ని యాడ్ చేసిన విషయం తెలిసిందే. గతంలోనూ మైత్రి మేకర్స్ పై పలుసార్లు ఐటీ దాడు జరిగాయి. ప్రస్తుతం మైత్రి మూవీస్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాలను నిర్మిస్తుంది. అలాగే మ్యాంగో మీడియా సంస్థల పై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. సింగర్ సునీత భర్త కు సంబందించిన ఆఫీసులు, ఇళ్ల పై కూడా సోదాలు చేస్తున్నారు అధికారులు.

Follow Us