Mythri Movie Makers: మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాలపై మెరుపు దాడి చేసిన GST అధికారులు

ఇప్పటివరకు ఒక లెక్క-ఇప్పట్నుంచి మరో లెక్క అన్నట్టుగా టాలీవుడ్‌కి షాకిచ్చింది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఇళ్లు, కార్యాలయాల్లో మెరుపు దాడులకు దిగింది

Mythri Movie Makers: మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాలపై మెరుపు దాడి చేసిన GST అధికారులు
Mythri Movie Makers
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 13, 2022 | 8:34 AM

తెలుగు రాష్ట్రాల్లో వరుస రెయిడ్స్‌ గుబులు రేపుతున్నాయ్‌. ఇప్పటివరకు సీబీఐ, ఈడీ, ఐటీ దడ పుట్టిస్తే… ఇప్పుడు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది GST డిపార్ట్‌మెంట్‌. ఇప్పటివరకు ఒక లెక్క-ఇప్పట్నుంచి మరో లెక్క అన్నట్టుగా టాలీవుడ్‌కి షాకిచ్చింది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఇళ్లు, కార్యాలయాల్లో మెరుపు దాడులకు దిగింది. హైదరాబాద్‌లోని మైత్రీ మూవీ మేకర్స్‌ కార్యాలయంతోపాటు ప్రొడ్యూసర్స్‌ యలమంచిలి రవి, నవీన్‌ ఎర్నేని ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు GST అధికారులు. హీరోలకు ఇచ్చిన రెమ్యునరేషన్స్‌పై వివరాలు సేకరించారు. దాదాపు ప్రతి సినిమా బడ్జెట్‌ వందకోట్లకు పైనే ఉండటంతో లెక్కలు అడిగారు. అయితే, సంస్థ ఆదాయానికి, జీఎస్టీ చెల్లింపులకు పొంతన లేనట్టు గుర్తించినట్టు తెలుస్తోంది.

పుష్ప, శ్రీమంతుడు, సర్కారు వారి పాట, జనతా గ్యారేజ్‌, రంగస్థలం, ఉప్పెన లాంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌… బడ్జెట్‌ లెక్కలు, కలెక్షన్లు సరిగా చూపలేదనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం… చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలయ్యతో వీరసింహారెడ్డి, పవన్ కల్యాణ్‌తో ఉస్తాద్ భగత్‌సింగ్‌, అల్లు అర్జున్‌తో పుష్ప-2 చిత్రాలను నిర్మిస్తోన్న మైత్రీ సంస్థ… ఆర్ధిక లావాదేవీలపై ఫోకస్‌ పెట్టింది GST టీమ్‌.

ఇవి కూడా చదవండి

ఎప్పుడు ఏ సంస్థపై దాడులు జరుగుతాయో తెలియక గజగజ వణికిపోతున్నారు బడా బాబులు. ఇప్పటివరకు సీబీఐ, ఈడీ, ఐటీ రెయిడ్స్‌ దడ పుట్టిస్తే, ఇప్పుడు GST జతకలవడం మరింత గుబులు రేపుతోంది. పైగా ఫిల్మ్ ఇండస్ట్రీని టార్గెట్ చేయడంతో టాలీవుడ్‌ మేకర్స్‌లో కలవరం మొదలైంది. మరి, ఈ GST రెయిడ్స్‌…మైత్రీ సంస్థతోనే ఆగుతాయా? లేక ఇతర సంస్థలనూ తాకే ఛాన్సుందా?