Prabhas: ఇదెక్కడి ట్విస్ట్ రా సామీ..! ప్రభాస్ సినిమా కోసం త్రివిక్రమ్ కొడుకు..

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి. బాహుబలికి ముందు ఏడాదికి ఒక సినిమా అనే నిబంధన ఉండేది ప్రభాస్కి. ఈ విషయం ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే తెలుస్తుంది. దీంతో ప్రభాస్ ఏడాదికి ఒకే సినిమాలో నటించేవాడు. అయితే ఇప్పుడు డిమాండ్ పెరగడంతో ప్రభాస్ ఆ రూల్ ని బ్రేక్ చేసి ఏడాదికి రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నాడు.

Prabhas: ఇదెక్కడి ట్విస్ట్ రా సామీ..! ప్రభాస్ సినిమా కోసం త్రివిక్రమ్ కొడుకు..
Prabhas

Updated on: Feb 21, 2025 | 11:18 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలు చేస్తుంటే మెంటలెక్కుతుందిగా.. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. సలార్, కల్కి సినిమాలు ఇచ్చిన హిట్ తో ప్రభాస్ స్పీడ్ పెంచేశాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా భారీ హిట్ సొంతం చేసుకుంది. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఈ సినిమాతో అభిమానులకు మంచి మీల్స్ పెట్టాడు ప్రభాస్. సలార్ సినిమాసక్సెస్ ను ఫ్యాన్ ఎంజాయ్ చేసే లోగా కల్కి సినిమాను దింపాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈమూవీ ఏకంగా రూ. 1000కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక ఇప్పుడు ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఇది కూడా చదవండి :ఏం సినిమారా బాబూ..! రూ. 80కోట్లు పెట్టి తీస్తే రూ. 8కోట్లు కూడా రాబట్టలేకపోయింది

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ సినిమా కోసం త్రివిక్రమ్ కొడుకు పని చేస్తున్నాడని సినీ సర్కిల్ లో టాక్ వినిపిస్తుంది.

ఇది కూడా చదవండి : కేరాఫ్ కంచరపాలెం సలీమా గుర్తుందా.? ఇప్పుడు ఆమె ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు.

తివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. చివరిగా వచ్చిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే త్రివిక్రమ్ కొడుకు త్వరలోనే దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తుంది. అంతకు ముందు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా కొంతమంది దర్శకుల దగ్గర పని చేయనున్నాడని   తెలుస్తుంది. ఇప్పటికే డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దగ్గర విజయ్ దేవరకొండ కింగ్ డమ్సినిమాకు ఏడీ గా వర్క్ చేశాడని అంటున్నారు. అలాగే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయనున్నాడని తెలుస్తుంది మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : మహేష్, పవన్‌లాంటి స్టార్స్‌తో ఆడిపాడిన ఈ బ్యూటీ గుర్తుందా..? 51ఏళ్ల వయసులోనూ సింగిల్‌గా ఉంటున్న

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.