Rajinikanth: సూపర్ స్టార్ 170 సినిమా కథ ఇదేనా..? రజినీకాంత్ ఎలా కనిపించనున్నారంటే..

ఈ సినిమాను నెల్సన్ దిలీప్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే నెల్సన్ దళపతి విజయ్ తో కలిసి బీస్ట్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Rajinikanth: సూపర్ స్టార్ 170 సినిమా కథ ఇదేనా..? రజినీకాంత్ ఎలా కనిపించనున్నారంటే..
Rajinikanth
Follow us

|

Updated on: Mar 04, 2023 | 7:53 AM

సూపర్ స్టార్ రంజినికాంత్ సినిమా సినిమాకు చిన్న గ్యాప్ ఇస్తున్నారు. సూపర్ స్టార్ చివరిగా చేసిన సినిమా పెద్దన్న తమిళ్ లో అన్నత్తే అనే టైటిల్ తో విడుదలైంది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేపోయింది. దాంతో ఇప్పుడు జైలర్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే నెల్సన్ దళపతి విజయ్ తో కలిసి బీస్ట్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో నెల్సన్ కూడా ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసిమీదఉన్నరు. ఈ క్రమంలోనే తలైవా సినిమాను పవర్ ఫుల్ కథతో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ జైలర్ గా కనిపిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సూపర్ స్టార్ 170వ సినిమా గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

‘జై భీమ్‌’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతోంది. ఈ సినిమా వస్తావ ఘటన ఆధారంగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో సూపర్ స్టార్ పోలీస్ గెటప్ లో కనిపించనున్నారట.

అప్పుడెప్పుడో ఈ సినిమాను అనౌన్స్‌ చేయడమే కాదు.. వచ్చే ఏడాది విడుదల చేస్తామంటూ డేట్‌ కూడా అనౌన్స్‌ చేసేశారు. జై భీమ్ సినిమా లానే ఈ సినిమా కూడా సమాజాన్ని ప్రశ్నించే కథతో ఉంటుంది తెలుస్తోంది.