AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: టైమ్ వేస్ట్ చేస్తున్నావ్‌! ఆ టాలీవుడ్ హీరోకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్! ఏం జరిగిందంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరికొన్ని గంటల్లో తన పుట్టిన రోజు జరుపుకోనున్నాడు. దీంతో ఇప్పటికే మెగా అభిమానులు నానా హంగామా చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ కు ముందస్తు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఆసక్తికరమైన పోస్టులు పెడుతున్నారు.

Ram Charan: టైమ్ వేస్ట్ చేస్తున్నావ్‌! ఆ టాలీవుడ్ హీరోకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్! ఏం జరిగిందంటే?
Ram Charan
Basha Shek
|

Updated on: Mar 26, 2026 | 7:37 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉంటున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, కమెడియన్ సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న పెద్ది సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే శుక్రవారం (మార్చి 27) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు. దీంతో సినీ అభిమానులు, నెటిజన్లు ముందుగానే ఈ మెగా హీరోకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇదే క్రమంలో రామ్ చరణ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధిచి కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి.

కాగా రామ్ చరణ్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ధృవ ఒకటి. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. అలాగే హ్యాండ్సమ్ హీరో నవదీప్ కూడా ఈ మూవీలో ఒక కీలక పాత్ర పోషించాడు. రామ్ చరణ్ టీమ్ మెంబర్,స్నేహితుడుగా గౌతమ్ ఐపీఎస్ పాత్రలో అద్భుతంగా యాక్ట్ చేశాడు.అయితే ఈ సినిమా షూటింగ్ లో రామ్ చరణ్, నవదీప్ ల మధ్య ఒక ఆసక్తికర సంఘటన జరిగిందట. నవదీప్ తన క్లోజ్ ఫ్రెండ్ అవ్వడం వల్ల అతన్ని రామ్ చరణ్ కామెంట్ చేసే వాడట. ఒక సన్నివేశంలో వీళ్లిద్దరి మధ్య ఎమోషనల్ సీన్లు చిత్రీకరిస్తున్నప్పుడు నవదీప్ సరిగ్గా చేయకపోతే రామ్ చరణ్ తనకి ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడట. టైం వేస్ట్ చేస్తున్నావ్ తొందరగా సీన్ ఫినిష్ చేయమని నవదీప్ కు చెప్పాడట చరణ్. అయితే ఇదంతా కామెడీగా జరిగిన కన్వర్జేషన్.

ఇవి కూడా చదవండి

రామ్ చరణే కాదు మెగా హీరోలందరితోనూ నవదీప్ కు మంచి అనుబంధం ఉంది. ధృవ సినిమాతో పాటు అల్లు అర్జున్ నటించిన ఆర్య 2 లో బన్నీ స్నేహితుడి పాత్రలో అదరగొట్టాడు నవదీప్. ఈ క్రమంలోనే ధృవ సినిమాలో కూడా రామ్ చరణ్- నవదీప్ చాలా ఫ్రెండ్లీగా , ఒకరి మీద ఒకరు కామెడీ పంచులు వేసుకున్నారట. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.

అభిమానులతో రామ్ చరణ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us