AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nikhil Siddhartha: ఈ దారుణాలు ఆగేదెన్నడు? టాలీవుడ్ హీరో నిఖిల్ సంచలన ట్వీట్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. సామాజిక స్పృహ కలిగిన ఈ హీరో సామాజిక సమస్యలపై తన దైన శైలిలో స్పందిస్తుంటాడు. అలా తాజాగా ఈ హీరో చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Nikhil Siddhartha: ఈ దారుణాలు ఆగేదెన్నడు? టాలీవుడ్ హీరో నిఖిల్ సంచలన ట్వీట్.. ఏం జరిగిందంటే?
Actor Nikhil Siddhartha
Basha Shek
|

Updated on: Mar 26, 2026 | 6:54 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. గురువారం (మార్చి 26) ఉదయం ప్రకాశం జిల్లా మార్కాపరం మండలం రాయవరం సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు టిప్పర్‌ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాద చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. అలాగే ఈ దుర్ఘటనలో మరో 25 మంది తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ బస్సు ప్రమాదం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించాడు. ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

‘నాకు తెలిసి గత 6 నెలల్లో ఇది నాలుగో బస్సు ప్రమాదం. ఈ ఘటనల్లో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు ఆగుతాయి. అధికారులు అన్ని ట్రావెల్స్ బస్సులు, రవాణా సంస్థలను తనిఖీ చేయాలి’ అంటూ పీఎం నరేంద్రమోడీ, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, తెలుగు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులను ట్యాగ్ చేశాడు నిఖిల్. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

నిఖిల్ ట్వీట్..

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం స్వయంభు అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు నిఖిల్. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నిఖిల్ యోధుడిగా కనిపించనున్నాడు. అలాగే సంయుక్తా మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘కె.జి.యఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్వయంభు సినిమాలో నిఖిల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర