AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి వద్దంటే డబ్బు..!

మీన రాశిలో ఈ నెల(మార్చి) 26 నుంచి ఏప్రిల్ 15 వరకు రవి, శనులు మాత్రమే సంచారం చేయడం జరుగుతోంది. ఈ రెండు గ్రహాలు తండ్రీ కుమారులే అయినప్పటికీ బద్ధ శత్రువులు. ఈ గ్రహాలు కలిశాయంటే జాతకుడు ఉచ్ఛ స్థితికైనా వెళ్లడం జరుగుతుంది. లేదా అధోగతి పాలు కావడమన్నా జరుగుతుంది. ఇందులో శనీశ్వరుడు ఐశ్వర్యాన్నిచ్చే అవకాశం ఉండగా, రవి అధికారమిస్తాడు. ప్రస్తుతం కొన్ని రాశులకు ఈ యుతి వల్ల ఉచ్ఛ స్థితి కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృషభం, మిథునం, కన్య, తుల, వృశ్చికం, కుంభ రాశుల వారు ఈ రెండు గ్రహాల యుతి వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందబోతున్నారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 26, 2026 | 7:24 PM

Share
వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో రవి, శనులు కలవడం తప్పకుండా అత్యంత ప్రబలమైన రాజయోగాన్ని కలగజేస్తుంది. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాక ఆర్థికంగా, సామాజికంగా కూడా ఉన్నత స్థానానికి వెళ్లడం, అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందడం జరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూ లలో అతి తేలికగా విజయాలు సాధిస్తారు. సంపద బాగా వృద్ధి చెందుతుంది. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. రాజకీయ, పాలనా వ్యవహారాలు విజయవంతంగా సాగిపోతాయి.

1 / 6
మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో రవి, శనులు కలవడం వల్ల, ఈ రాశివారికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఏ రంగంలో ఉన్నా అందలాలు ఎక్కుతారు. వీరు ప్రభుత్వ ఉన్నతోద్యోగాలకు ప్రయత్నించడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరి ష్కారం అవుతాయి. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఊహించని రీతిలో స్థిరమైన, లాభదాయకమైన ఉద్యోగం లభిస్తుంది.

2 / 6
అన్ని దేవుళ్లలో శ్రీరాముడి అనుగ్రహం ఉంటే జరగవని అనుకున్న పనులు కూడా జరుగుతాయి. కన్యా రాశి వారికీ అంతే. వీళ్లు ఏం చేసిన  తిరుగుండదు. భార్య భర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమ చిగురిస్తుంది. ఆర్థిక సమస్యలు కూడా మెరుగుపడతాయి. వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి.

3 / 6
తుల: ఈ రాశికి రవి, శనులిద్దరూ ఆదాయ వృద్ధికి తోడ్పడే గ్రహాలే అయినందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. అను కోకుండా పితృవర్గం నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏ వివాదమైనా అనుకూలంగా పరిష్కారమవుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబాన్ని ఉన్నతస్థాయికి తీసుకువెళ్లగల శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.

4 / 6
వృశ్చికం: మూడు గ్రహాలు ఒక రాశిలోకి వెళ్ళడం వలన వీరికి రాజపూజ్యాలు బాగా పెరుగుతాయి. అంటే ఏది పట్టుకుంటే అది పట్టిందల్లా బంగారం అవుతుంది. సమాజంలో కూడా వీరి గౌరవమర్యాదలు పెరుగుతాయి. పని చేస్తున్న ఉద్యోగంలో మంచి పేరు వస్తుంది. 
వృత్తి, వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. కొత్త పరిచయాల వలన కొన్ని గెలుస్తారు.

వృశ్చికం: మూడు గ్రహాలు ఒక రాశిలోకి వెళ్ళడం వలన వీరికి రాజపూజ్యాలు బాగా పెరుగుతాయి. అంటే ఏది పట్టుకుంటే అది పట్టిందల్లా బంగారం అవుతుంది. సమాజంలో కూడా వీరి గౌరవమర్యాదలు పెరుగుతాయి. పని చేస్తున్న ఉద్యోగంలో మంచి పేరు వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. కొత్త పరిచయాల వలన కొన్ని గెలుస్తారు.

5 / 6
కుంభం: ఈ రాశికి ధన స్థానంలో రవి, శనులు కలవడం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. లాభదాయక పరిచయాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆర్థికంగా ఎటు వంటి ప్రయత్నమైనా సఫలమవుతుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి.

6 / 6
Follow Us