Dabur: డాబర్‌కు ఎదురుదెబ్బ.. బయటపడిన నిజం.. ఉత్పత్తులపై నిషేధం..!
Dabur: తప్పుదారి పట్టించే శాతం వంటి ప్రకటనను నిలిపివేయాలని డాబర్‌కు గతంలోనే నోటీసు జారీ చేసినట్లు FSSAI తెలిపింది. అయితే, డాబర్ ఎటువంటి సంతృప్తికరమైన దిద్దుబాటు చర్య తీసుకోలేదు. FSSAI నోటీసు తర్వాత డాబర్ ఇండియా ఒక ప్రకటనలో "మాకు నోటీసు అందింది..

Dabur: ‘100 శాతం స్వచ్ఛమైనవి’ అనే వాదనతో తేనె, ఆవు నెయ్యి, వంట నూనెలు వంటి పలు ఉత్పత్తులను విక్రయించకుండా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FSSAI) డాబర్ ఇండియాను నిషేధించింది. అటువంటి లేబులింగ్ చట్టవిరుద్ధమని FSSAI పేర్కొంది. 100 శాతం నాణ్యత ఉన్నాయని చెప్పుకునే తేనె, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నీరు వంటి ఆహార ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేయాలని డాబర్ ఇండియా లిమిటెడ్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సోమవారం ఇంటర్నెట్ మీడియాలో పోస్ట్ చేసింది.
నోటీసులో పేర్కొన్న ఆహార ఉత్పత్తుల అమ్మకాలను, అలాగే 100 శాతం స్వచ్ఛత అనే తప్పుదోవ పట్టించే వాదనతో ఉన్న అన్ని ఇతర ఆహార ఉత్పత్తుల అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని, ఈ విషయమై తీసుకున్న చర్యలపై 15 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ డాబర్ ఇండియా లిమిటెడ్‌ను ఆదేశించింది.
కంపెనీ వెబ్‌సైట్‌లో విక్రయిస్తున్న ఆహార ఉత్పత్తులలో ‘100 శాతం సహజమైనది’, ‘100 శాతం స్వచ్ఛమైనది’, ‘100 శాతం స్వచ్ఛతకు హామీ’, ‘100 శాతం సేంద్రీయమైనది’ అలాగే ‘100 శాతం కొబ్బరి నీరు’ వంటి తప్పుదోవ పట్టించే వాదనలు ఉన్నట్లు FSSAI తెలిపింది.
ఇది కూడా చదవండి: Gold: భారత్‌లో బంగారం ధర రూ.37,000 మేర తగ్గినా, ప్రజలు ఎందుకు కొనడం లేదు.. అసలు కారణం ఇదేనా?
‘100 శాతం’ అనే వాదనను ఉపయోగించడం అనేది ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలు, 2018ని ఉల్లంఘించడమేనని, ఎందుకంటే అది అస్పష్టంగా అప్రామాణికంగా ఉందని, వినియోగదారులను తప్పుదారి పట్టించవచ్చని నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. తప్పుదారి పట్టించే శాతం వంటి ప్రకటనను నిలిపివేయాలని డాబర్‌కు గతంలోనే నోటీసు జారీ చేసినట్లు FSSAI తెలిపింది. అయితే, డాబర్ ఎటువంటి సంతృప్తికరమైన దిద్దుబాటు చర్య తీసుకోలేదు. FSSAI నోటీసు తర్వాత డాబర్ ఇండియా ఒక ప్రకటనలో “మాకు నోటీసు అందింది. మా వెబ్‌సైట్‌లో నోటీసులో పేర్కొన్న సమాచారాన్ని ధృవీకరిస్తున్నాము” అని తెలిపింది.
FSSAI has issued a Prohibition Order directing M/s Dabur India Limited to immediately cease the sale of food products carrying misleading “100%” claims.#FSSAINotice #FSSAIAction pic.twitter.com/7GdNRUJFyh
— FSSAI (@fssaiindia) August 3, 2026
ఇది కూడా చదవండి: UPI New Rule: మారనున్న UPI చెల్లింపు విధానం.. భారీ ప్లాన్‌కు సిద్ధమవుతున్న ఆర్బీఐ!
Auto Tips: ఏడాదిలో కారు, బైక్ కొనడానికి ఏ నెల అనుకూలం? వేల రూపాయలు ఆదా చేసే ట్రిక్స్..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




