AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గరుడ పురాణం చెబుతున్న పెళ్లి ఆలస్యం రహస్యాలు.. మీరు ఎప్పటికీ ఊహించని కారణాలు!

Garuda Purana Marriage Problems: చాలా మంది అమ్మాయిలు లేదా అబ్బాయిలు తమకు వివాహ వయస్సు వచ్చినా పెళ్లి సంబంధాలు కుదరడం లేదని బాధపడుతుంటారు. దీని వెనుక కొన్ని కారణాలు ఉండవచ్చు. అవి మీ పెళ్లికి ఒక అడ్డంకిగా మారవచ్చు. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Mar 26, 2026 | 7:14 PM

Share
ఇటీవల కాలంలో చాలా మంది పెళ్లి గురించి కలలు కంటూ ఉంటున్నారు. కానీ, ఏదో ఒక కారణం వల్ల అది ముందుకు సాగడం లేదు. ఇది వ్యక్తి, వారి కుటుంబాలకే కాక,  మానసికంగా కూడా ఒత్తిడిని కలిగిస్తుంది. అటువంటి  పరిస్థితిలో, గరుడ పురాణం ప్రకారం పెళ్లి ఆటంకాలకు   ముఖ్యమైన కారణాలను తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది.

1 / 6
గరుడ పురాణం ప్రకారం.. వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల  మధ్య సంబంధం కాదు, ఇది రెండు ఆత్మల కలయిక. సరైన సమయం, పరిస్థితులు లేకపోతే.. ఆ బంధంలో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఈ సమస్యల వెనుక కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి.

గరుడ పురాణం ప్రకారం.. వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం కాదు, ఇది రెండు ఆత్మల కలయిక. సరైన సమయం, పరిస్థితులు లేకపోతే.. ఆ బంధంలో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఈ సమస్యల వెనుక కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి.

2 / 6
పూర్వ కర్మ ప్రభావం: గతంలో చేసిన తప్పులు, నమ్మకాన్ని దెబ్బతీసిన సంఘటనలు లేదా మనోవేదనలు భవిష్యత్ సంబంధాలపై ప్రభావం చూపవచ్చు. పూర్వీకుల క్రమంలో జరిగిన అసమర్ధతలు లేదా కుటుంబ సంబంధ సంఘటనలు కూడా సమస్యలకు కారణం అవుతాయి.

3 / 6
వ్యక్తిత్వం, స్వభావం: పరిపూర్ణమైన భాగస్వామిని ఆశించడం, ఒప్పుకోలేని వైఖరి లేదా ఆత్మకేంద్రిత ఆలోచనలు సంబంధాల్లో ఆటంకాలను సృష్టిస్తాయి.

వ్యక్తిత్వం, స్వభావం: పరిపూర్ణమైన భాగస్వామిని ఆశించడం, ఒప్పుకోలేని వైఖరి లేదా ఆత్మకేంద్రిత ఆలోచనలు సంబంధాల్లో ఆటంకాలను సృష్టిస్తాయి.

4 / 6
గ్రహలు, నక్షత్రరాశులు: కొన్ని సందర్భాల్లో వ్యక్తి గ్రహ దశలు, నక్షత్రరాశులు కూడా వివాహంలో అడ్డంకులు కలిగిస్తాయని నమ్మకం ఉంది.

గ్రహలు, నక్షత్రరాశులు: కొన్ని సందర్భాల్లో వ్యక్తి గ్రహ దశలు, నక్షత్రరాశులు కూడా వివాహంలో అడ్డంకులు కలిగిస్తాయని నమ్మకం ఉంది.

5 / 6
పరిసరాలు, మానసిక స్థితి: ఇంటి వాతావరణం, నిరంతర వాదనలు, ఒత్తిడి, భవిష్యత్తు గురించి భయాలు కూడా సంబంధానికి ప్రతికూలంగా చేస్తాయి.

ఇలా, వివాహంలో ఆటంకాలు కేవలం విధి కారణం వల్ల మాత్రమే రావు. వ్యక్తి స్వభావం, ఆలోచనలు, కుటుంబ వాతావరణం, పూర్వ అనుభవాలు, కొన్ని సందర్భాల్లో గ్రహల ప్రభావం కూడా ఈ సమస్యలకు కారణం కావచ్చు. గరుడ పురాణం ఈ అంశాలన్నింటినీ స్పష్టంగా సూచిస్తుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

పరిసరాలు, మానసిక స్థితి: ఇంటి వాతావరణం, నిరంతర వాదనలు, ఒత్తిడి, భవిష్యత్తు గురించి భయాలు కూడా సంబంధానికి ప్రతికూలంగా చేస్తాయి. ఇలా, వివాహంలో ఆటంకాలు కేవలం విధి కారణం వల్ల మాత్రమే రావు. వ్యక్తి స్వభావం, ఆలోచనలు, కుటుంబ వాతావరణం, పూర్వ అనుభవాలు, కొన్ని సందర్భాల్లో గ్రహల ప్రభావం కూడా ఈ సమస్యలకు కారణం కావచ్చు. గరుడ పురాణం ఈ అంశాలన్నింటినీ స్పష్టంగా సూచిస్తుంది. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

6 / 6
Follow Us