AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తు పట్టారా? హెచ్‌ఆర్‌గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు తెలుగులో ఫేమస్ నటిగా..

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలు బాగా వైరలవుతుంటాయి. ముఖ్యంగా సినిమా తారల చిన్ననాటి ఫొటోస్, త్రో బ్యాక్ ఫొటోస్ తెగ చక్కర్లు కొడుతుంటాయి. అలా ఇప్పుడు ఒక తెలుగు నటికి చెందిన టీనేజ్ ఫొటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

Tollywood: ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తు పట్టారా? హెచ్‌ఆర్‌గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు తెలుగులో ఫేమస్ నటిగా..
Tollywood Actress
Basha Shek
|

Updated on: Mar 26, 2026 | 5:03 PM

Share

పై ఫొటోలో కళ్లజోడు పెట్టుకుని క్యూట్ గా కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఆమె తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్. అలాగనీ హీరోయిన్ కాదు. కానీ అంతకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్, గుర్తింపును ఆమె సొంతం చేసుకుంది. ముఖ్యంగా తన అందం, అభినయంతో ఎంతో మందికి ఫేవరెట్ నటిగా మారిపోయింది. అన్నట్లు ఈ నటిది మన విశాఖపట్నమే. ఇక్కడే పుట్టి పెరిగింది. బాగా ఉన్నత చదువులు చదువుకుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లోని ఓ మల్టీ నేషనల్ కంపెనీలో హెచ్ ఆర్ గా కెరీర్ ప్రారంభించింది. అయితే ఈ అమ్మడికి చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది. స్కూల్ లో స్కిట్లు, డ్రామాల్లో నటించిన అనుభవం ఉండడంతో జాబ్ కు రిజైన్ చేసి హైదరాబాద్ లోకి అడుగు పెట్టింది. తనకు పరిచయమున్న వారితో కలిసి ఆడిషన్స్ ఇవ్వడం ప్రారంభించింది. అలా ఓ సినిమాలో హీరోయిన్ కు డబ్బింగ్ చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వెంటనే ఓ వెబ్ సిరీస్ లో నటిగా అవకాశం వచ్చింది. అది సక్సెస్ అవ్వడంతో తనకు మరిన్ని అవకాశాలు క్యూ కట్టాయి.

ఇప్పుడు సోషల్ మీడియా మరీ ముఖ్యంగా యూట్యూబ్ ఫాలో అయ్యే వారికి ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. ముఖ్యంగా ప్రసాద్ బెహ్రాతో కలిసి ఆమె చేసిన షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లకు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఆ ఫొటోలో ఉన్నది మరెవరో కాదు విరాజిత. అదే నండీ.. పెళ్లి వారమండి వెబ్ సిరీస్ లో ప్రసాద్ బెహ్రాతో కలిసి నవ్వులు పంచిన నటి.

ఇవి కూడా చదవండి

విరాజిత లేటెస్ట్ ఫొటోస్..

కరోనా, లాక్ డౌన్ కాలంలో విరాజిత పేరు బాగా మార్మోగిపోయింది. పెళ్లి చూపులు, లవ్ స్టోరీ, కోవిడ్ హాస్పిటల్స్, 30 ఎఫ్ అండ్ ఎన్ మ్యారీడ్, నువ్వే కావాలి, రాధా గోపాళం-1,2, పెళ్లి వారమండి తదితర వెబ్ సిరీస్ లు , షార్ట్ ఫిల్మ్స్ ఈ బ్యూటీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక హీరోయిన్ గా కన్నా మంచి నటి కావాలన్నదే తన లక్ష్యమంటోంది విరాజిత. అదే సమయంలో స్కిన్ షో, గ్లామర్ రోల్స్ కు పూర్తిగా దూరమంటోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర