RC 16: చరణ్, బుచ్చిబాబు సినిమా క్రేజీ అప్డేట్.. గ్లోబల్ స్టార్‌ను ఈసారి అలా చూపించబోతున్నారా.?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తెలుగమ్మాయి అంజలి హీరోయిన్స్ గా నటించారు. తమిళ నటుడు ఎస్ జే సూర్య ప్రతినాయకుడి పాత్రలో ఆకట్టుకున్నాడు. వీరితో పాటు శ్రీకాంత్, సునీల్, రాజీవ్ కనకాల, జయరాం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా గేమ్ సినిమా ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ సినిమా విడుదల తర్వాత అంతా తారుమారు అయ్యింది. సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఒకే ఒక్క సినిమాతో స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు బుచ్చి బాబు.
సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా చేసి ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. ఉప్పెన సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా మెగా వైష్ణవ్ తేజ్ , కృతిశెట్టి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలాగే ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించారు. ఇదిలా ఉంటే ఉప్పెన సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బుచ్చిబాబు ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
మొన్నామధ్య ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా నిర్వచించారు. గేమ్ ఛేంజర్ హడావిడి అయిపోవడంతో ఇప్పుడు బుచ్చిబాబు సినిమా పై ఫోకస్ పెట్టాడు చరణ్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా రంగస్థలం సినిమా మాదిరి గ్రామీణ నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమాలో చరణ్ గుడ్డివాడిగా కనిపిస్తాడని కూడా టాక్ వినిపిస్తుంది. రంగస్థలం సినిమాలో చరణ్ చెవిటి వాడి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలో గుడ్డివాడిగా కనిపిస్తాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి