Anirudh Ravichander: సింగర్‌తో డీప్ లవ్ లో మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్.. ఆమె ఎవరంటే
ముఖ్యంగా యువతను అనిరుద్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. మాస్ సాంగ్స్ కు అనిరుద్ పెట్టింది పేరు. అనిరుద్ కంపోజ్ చేసిన వై దిస్ కొలవెరి కొలవెరి కొలవెరి డి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇండస్ట్రీలో మ్యూజిక్ కంపోజర్స్ లో ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉన్న వాళ్ళ లిస్ట్ తీస్తే మొదటి వరసలో ఉంటాడు అనిరుద్. సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా యువతను అనిరుద్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. మాస్ సాంగ్స్ కు అనిరుద్ పెట్టింది పేరు. అనిరుద్ కంపోజ్ చేసిన వై దిస్ కొలవెరి కొలవెరి కొలవెరి డి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తెలుగులోనూ పలు సినిమాలకు మ్యూజిక్ అందించాడు అనిరుద్. అజ్ఞాతవాసి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ లేటెస్ట్ సెన్సేషన్. ఆతర్వాత నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాకు సంగీతం అందించాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాకు మ్యూజిక్ అందించనున్నాడు.
ఇదిలా ఉంటే అనిరుద్ మ్యూజిక్ ఎంత ఫేమసో.. ఆయన వివాదాలతోనూ ఫేమస్ అయ్యారు. గతంలో ఆయన ఓ సింగర్ కు డీప్ లిప్ కిస్ ఇస్తున్న ఫోటో అప్పట్లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో అప్పట్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఇప్పుడు మరో సారి అనిరుద్ గురించి ఓ వార్త హల్ చేస్తోంది. ఓ ఫెమస్ సింగర్ తో అనిరుద్ ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని న్యూస్ వైరల్ అవుతుంది. అమ్మడు ఎవరో కాదు జోనితా గాంధీ. ఈ సింగర్ కూడా పాపులరే. ఈ ఇద్దరూ విక్రమ్ మూవీ నుంచి లవ్ లో పడ్డారని టాక్. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అంటున్నారు . ఈ వార్తల పై ఇద్దరూ స్పందించకపోవడంతో ఆ వార్తలకు బలం చేకూరుతుంది. Jonita Gandhi